కరీంనగర్‌ కలెక్టర్‌కు చుక్కలు చూపించిన ఆలుమగలు

Published on Tue, 09/16/2025 - 07:59

కరీంనగర్‌ అర్బన్‌: ఓ దంపతుల ఫిర్యాదు ప్రజావాణిలో కలకలం రేపింది. తన భూమి చెరువు నీటితో మునిగిపోయిందని, తన కుమారునికి ఉద్యోగం కల్పించాలని భార్య ఫిర్యాదు చేయగా.. తనను మోసం చేసి, తాను చనిపోయినట్లు ప్రభుత్వానికి దరఖాస్తు చేసి భార్య వితంతు పింఛన్‌ పొందుతోందని భర్త ఇచ్చిన ఫిర్యాదుతో కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి కంగుతిన్నారు. కరీంనగర్‌ జిల్లా మానకొండూరు మండలం పోచంపల్లికి చెందిన పిల్లి భారతి–రాజమౌళి దంపతులు. 

కొన్నాళ్లుగా ఎవరికి వారుగా జీవనం సాగిస్తున్నారు. కాగా, సోమవారం జరిగిన ప్రజావాణికి భారతి అర్జీతో వచ్చింది. గతంలో కలెక్టర్‌ తనకు ఉద్యోగమిచ్చారని, ఆరోగ్యం బాగులేకపోవడం వల్ల చేయలేకపోయానని, సదరు ఉద్యోగాన్ని తన కుమారునికి ఇప్పించాలని ఆడిటోరియంలోకి వస్తూనే బైఠాయించింది. దీంతో పోలీసులు రంగప్రవే«శం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే భారతి ఎపిసోడ్‌ ముగియగానే రాజమౌళి ప్రజావాణికి వచ్చి ఫిర్యాదు చేశాడు. 

తాను బతికుండగానే మరణించినట్లు ధ్రువీకరణపత్రం తీసుకుని భార్య వితంతు పింఛన్‌ పొందుతోందని కన్నీటిపర్యంతమయ్యాడు. పోచంపల్లి గ్రామంలో పదెకరాల భూమి ఉండగా 2016లో సదరు భూమిని మరణ ధ్రువపత్రం ఆధారంగా ఆమె పేరిట భూ బదలాయింపు చేశారని, ఇదెక్కడి అన్యాయమని ప్రశ్నించారు. కాగా ఇరువురి ఫిర్యాదులపై క్షేత్రస్థాయి విచారణ చేసి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. 

 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)