Breaking News

భార్య వివాహేతర సంబంధం..సెల్పీవీడియోతో భర్త బలవన్మరణం

Published on Tue, 08/19/2025 - 11:59

భద్రాద్రికొత్తగూడెం జిల్లా: మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఆమె భర్త మృతికి కారణమైన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కటకటాల పాలయ్యాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రికొత్తగూడెం జిల్లా జూలురుపాడు మండలం సూర్యాతండాకు చెందిన వాంకుడోత్‌ బావుసింగ్‌ ములుగు జిల్లా వాజేడు మండలం బిజినేపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో జూలురుపాడుకు చెందిన ఓ మహిళతో పరిచయం ఏర్పడి అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. 

ఈ విషయం సదరు మహిళ భర్తకు తెలియడంతో అతను సూసైడ్‌ నోట్‌ రాసి సెల్ఫీ వీడియో తీసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సూసైడ్‌ నోట్, సెల్ఫీ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన కొత్తగూడెం పోలీసులు సదరు ఉపాధ్యాయుడిని ఈనెల 11వ తేదీన అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిసింది. ఈ విషయంపై ఎంఈఓ వెంకటేశ్వర్లును వివరణ కోరగా బావుసింగ్‌ను అరెస్ట్‌ చేసిన మాట వాస్తమే కాని తనకు, జిల్లా విద్యాశాఖకు ఎలాంటి సమాచారం లేదన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ దృష్టా సమీపంలోని మొరుమూరు పాఠశాల నుంచి ఓ ఉపాధ్యాయుడిని బిజినేపల్లి పాఠశాలకు పంపిస్తున్నట్లు తెలిపారు.   

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)