Breaking News

‘అయ్యోపాపం.. గణేశ్‌ ప్రాణం గాలిలో కలిసి పోయిందా?’

Published on Wed, 07/16/2025 - 14:03

పెద్దపల్లిరూరల్‌: ‘అయ్యోపాపం.. అన్నెంపున్నెం ఎరగని గాండ్ల గణేశ్‌(37) ప్రాణం గాలిలో కలిసి పోయిందా?’ అని రాఘవాపూర్‌ గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులు, గ్రామ స్తుల కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలో స్క్రాప్‌ వ్యాపారం చేసే పస్తం జంపయ్య వద్ద గాండ్ల గణే శ్‌ పదేళ్లకుపైగా సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. వచ్చే ఆదాయంతో తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. జంపయ్య కుటుంబంలోనూ ఆ యన ఒకడిగా ఉంటున్నాడు. మంగళవారం జంపయ్య సోదరి లక్ష్మి, బావ మారయ్య పంచాయితీకి ఇతను కూడా సుగ్లాంపల్లి గ్రామ సమీపంలోకి వెళ్లాడు. గతంలో మాదిరిగానే ఇదికూడా సా ధారణ పంచాయితీగానే ఉంటుందని భావించా డు. అనూహ్యంగా జరిగిన కత్తుల దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు.

జీతమే ఆధారం..
నిరుపేద కుటుంబీకుడైన గాండ్ల గణేశ్‌ రాఘవాపూర్‌ గ్రామంలో అందరితో మర్యాదగా ఉంటాడు. యజమాని ఇచ్చే జీతంతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తల్లి శాంతమ్మ అనారోగ్యంతో మంచానికే పరిమితమైంది. భార్య రజిత, కూతురు రిత్విక(4) ఉన్నారు. స్క్రాప్‌ వ్యాపారం సాగించే పస్తం జంపయ్య వద్ద సూపర్‌వైజర్‌గా విధులు నిర్వర్తిస్తుంటాడు.

మాకు దిక్కెవరు?
‘అయ్యో.. వివాదంతో ఏసంబంధం లేనితన భర్త ను అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారు.. ఇక మాకు దిక్కెవర’ని మృతుడు గణేశ్‌ భార్య రజిత రోదించిన తీరు కలచివేసింది. నాలుగేళ్ల పాపతో ‘నువు లేకుండా ఎలా బతికేద’ని విలపిస్తున్న తీరు స్థానికులను చలింపజేసింది.

పరిహారం చెల్లింపు!
జీతంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న గాండ్ల గణేశ్‌ మృతి చెందడంతో ఆ కుటుంబానికి ఏ ఆధారం లేకుండా పోయిందని, మృతుడి కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారంగా ఇవ్వాలని గ్రామపెద్దలు, బంధువులు డిమాండ్‌ చేశారు. ఇరువర్గాల మధ్య జరిపిన చర్చల్లో అంత్యక్రియల కోసం రూ.లక్షతో పాటు కుటుంబానికి రూ.15 లక్షలు పరిహారంగా ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్టు సమాచారం.

పెగడపల్లిలో విషాదం
కాల్వశ్రీరాంపూర్‌(పెద్దపల్లి): సుగ్లాంపల్లిలో జరిగి న భార్యాభర్తల పంచాయితీ ఘర్షణలో మోటం మల్లేశం మృతి చెందడంతో పెగడపల్లి గ్రామంలో విషాదం అలముకుంది. మల్లేశం బతుకుదెరువు కోసం సుమారు 15 ఏళ్ల క్రితం పెగడపల్లి గ్రామానికి వలస వచ్చాడు. బోళ్ల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఓదెల, కాల్వశ్రీరాంపూర్‌, సుల్తానాబాద్‌, ముత్తారం మండలాల్లో వ్యాపారం చేస్తున్నాడు. ప్రస్తుతం చేపట్టిన సొంతింటి నిర్మాణం చివరి దశలో ఉంది. గృహప్రవేశం చేయాల్సి ఉంది. ఇంతలోనే ప్రాణాలు కోల్పోవడంతో గ్రామస్తులు హతాశులయ్యారు. మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్‌, మాజీ సర్పంచ్‌ సుజాత, కాంగ్రెస్‌ నాయకులు మియాపురం సతీశ్‌ తదితరులు సంతాపం ప్రకటించారు.

 

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు