Breaking News

నువ్వులేక.. నేనుండలేను

Published on Sun, 05/25/2025 - 11:18

కామారెడ్డి(జుక్కల్‌): రోడ్డు ప్రమాదంలో భార్య మరణా న్ని తట్టుకోలేకపోయిన ఒక భర్త తీవ్ర మనస్తాపంతో యాసిడ్‌ తాగి మరణించాడు. వివరాలివి. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన సునీల్‌కు, పెద్దతడ్గూర్‌ గ్రామానికి చెందిన జ్యోతితో గతేడాది పెళ్లి జరిగింది. ప్రస్తుతం జ్యోతి ఆరు నెలల గర్భవతి. శుక్రవారం భార్యాభర్తలు కలిసి బైక్‌పై వెళ్తుండగా.. బిచ్కుంద శివారులోని మైసమ్మ గుడి వద్ద అదుపు తప్పి పడిపోయారు. 

ఈ ప్రమాదంలో జ్యోతి (22) తలకు తీవ్రగాయాలై మృతి చెందింది. మృతదేహాన్ని అంబులెన్స్‌లో బిచ్కుందలోని ఇంటికి తీసుకొచ్చారు. శవాన్ని దించిన కొద్దిసేపటికే.. సునీల్‌ (26) తీవ్ర మనస్తాపంతో యాసిడ్‌ తాగాడు. బంధువులు అదే అంబులెన్స్‌లో సునీల్‌ను ఆస్పత్రికి తరలించారు. నిజామాబాద్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి సు నీల్‌ మృతి చెందాడు. భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, తమకు సంతా నం కలగబోతోందని సంతోషపడేవారని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)