Breaking News

ఆ రెండింటిపై ఫుల్‌ ‘ఫోకస్‌’

Published on Mon, 04/07/2025 - 04:30

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ, రాజీవ్‌ యువ వికాసం పథకాలకు విస్తృత ప్రచారం కల్పించాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. పేదలకు మేలు చేసే ఈ రెండు పథకాలు కంచ గచ్చిబౌలి భూముల వివాదంతో చర్చలో లేకుండా పోయాయని అభిప్రాయపడుతోంది. ఆ రెండు పథకాలపై ఫోకస్‌ పెంచి ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం చేపట్టాలని యోచిస్తోంది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. 

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గత 15 నెలల్లో అమలు చేసిన అన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రచారం కల్పించేందుకు వీలుగా ఓ కరపత్రాన్ని టీపీసీసీ సిద్ధం చేసింది. ఈ కరపత్రాలను క్షేత్రస్థాయిలో పంపిణీ చేయడం ద్వారా కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాల గురించి ప్రజలకు పార్టీ శ్రేణులు వివరించనున్నాయి. ముఖ్యంగా సన్న బియ్యం, రాజీవ్‌ యువ వికాసం కార్యక్రమాల గురించి ప్రజలకు ప్రత్యేకంగా వివరించే విధంగా పార్టీ కార్యాచరణ రూపొందుతోందని, దీనిని ఒకట్రెండు రోజుల్లో టీపీసీసీ విడుదల చేయనుందని సమాచారం.  

భూముల వివాదంతో మరుగున.. 
పదేళ్ల పాటు అధికారంలో ఉన్నా బీఆర్‌ఎస్‌ చేయలేని పేదలకు ఉపయోగపడే రెండు కార్యక్రమాలను కాంగ్రె స్‌ ప్రభుత్వం చేపట్టినప్పటికీ, కంచ గచ్చిబౌలి భూము ల వ్యవహారంతో అవి మరుగున పడ్డాయనే అభిప్రా యం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని 80 శాతం ప్రజలకు అమలయ్యే విధంగా రేషన్‌షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించినా పెద్దగా ప్రచారం లేకుండా పోయిందనే చర్చజరుగుతోంది. 

రాజీవ్‌ యువ వికాసం పరిస్థితి కూడా ఇ దే విధంగా ఉందని అంటున్నారు. పదేళ్లపాటు  నిరు ద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకాలు అమలు కాలేదని, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు కూడా నిర్వీర్యమయ్యాయనే ఉద్దేశంతో మళ్లీ గ్రామాల్లోని యువతకు ఉపాధి కల్పించేలా దీనికి రూపకల్పన చేసినా ఫలితం లేకుండా పోయిందంటున్నారు.

లబ్దిదారులతో భోజనాలు.. నిరుద్యోగులకు సాయం 
టీపీసీసీ కీలక నేత ఒకరు మాట్లాడుతూ ‘కంచ గచ్చిబౌలిభూముల వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. ప్రభుత్వాన్ని ఓ వైపు బద్నాం చేస్తూనే మరోవైపు పార్టీకి ప్రయోజనం చేకూర్చే పథకాలు మరుగున పడేలా చేస్తోంది. రాజకీయ రాద్ధాంతం కింద పేదల సంక్షేమం నలిగిపోతోంది..’అని వ్యాఖ్యానించడం కాంగ్రెస్‌ నేతల్లో ఉన్న అభిప్రాయానికి అద్దం పడుతోంది. 

ఈ నేపథ్యంలో సన్న బియ్యంతో కూడిన భోజనాన్ని లబ్ధిదారులతో కలిసి చేసేలా పార్టీలోని అన్ని స్థాయిల నేతలకు దిశానిర్దేశం చేయాలని, మరోవైపు రాజీవ్‌ యువ వికాసం పథకం కోసం దరఖాస్తు చేసుకునే నిరుద్యోగులకు క్షేత్రస్థాయి కేడర్‌ సహకరించేలా పిలుపునివ్వాలని టీపీసీసీ యోచిస్తుండడం గమనార్హం.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)