Breaking News

యువ ఐఏఎస్‌ అధికారికి ఫ్యూచర్‌ సిటీ పగ్గాలు!

Published on Wed, 04/02/2025 - 20:00

సాక్షి, హైద‌రాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అయిన ఫ్యూచర్‌ సిటీ (Future City) అభివృద్ధిలో కీలకమైన అడుగు పడనుంది. ఈ మేరకు ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎఫ్‌సీడీఏ)కి కమిషనర్‌ను నియమించనున్నారు. చురుకైన యువ ఐఏఎస్‌ అధికారిని ప్రాజెక్ట్‌ సారథిగా నియమిస్తే బాగుంటుందనే భావనలో సీఎం రేవంత్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతిపాదిస్తున్న ఫోర్త్‌ సిటీని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఎఫ్‌సీడీఏ (FCDA) పరిధిని ప్రత్యేకంగా భావిస్తోంది.

ప్రపంచ ప్రఖ్యాత ఐటీ, ఫార్మా, క్రీడారంగాలకు ప్రాధాన్యతనిస్తున్న సర్కారు.. ఆ మేరకు జోన్‌లను కూడా నిర్దేశిస్తోంది. వీటన్నింటిని గమనంలోకి తీసుకుంటున్న ప్రభుత్వ పెద్దలు అంతర్జాతీయ నగరాలపై అవగాహన ఉన్న యువ అధికారులకు దీని పాలనపగ్గాలు కట్టబెట్టే దిశగా ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలోనే.. గతంలో రంగారెడ్డి జిల్లా (Rangareddy District) కలెక్టర్లుగా వ్యవహరించిన కె.శశాంక( 2013), డాక్టర్‌ ఎస్‌.హరీశ్‌(2015) పేర్లను పరిశీలిస్తోంది. ఈ ప్రాంతంపై వీరికి స్పష్టమైన అవగాహన ఉండడం కలిసొచ్చే అంశంగా భావిస్తోంది. అలాగే గోపి (2016) పేరును కూడా పరిగణనలోకి తీసుకుంటున్న సర్కారు.. అతి త్వరలోనే తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది.

90 పోస్టులకు గ్రీన్‌సిగ్నల్‌.. 
హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌ తర్వాత గ్రేటర్‌లో ఫోర్త్‌ సిటీ (Fourth City) అవసరం ఉందని సీఎం రేవంత్‌ నిర్ణయించారు. 765.28 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫోర్త్‌ సిటీని అభివృద్ధి చేయాలన్నది రేవంత్‌ సర్కార్‌ లక్ష్యం. మహేశ్వరం, ఆమన్‌గల్, కడ్తాల్, కందుకూరు, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల ఏడు మండలాల్లోని 56 గ్రామాలు ఎఫ్‌సీడీఏ పరిధిలోకి వస్తాయి. ఇప్పటికే ఎఫ్‌సీడీఏ కోసం కొత్తగా 90 పోస్టులకు మంత్రివర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది వీటిలో 34 రెగ్యులర్‌ పోస్టులు కాగా..మిగిలిన 56 పోస్టులను ఔట్‌ సోర్సింగ్‌/కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు. ఎఫ్‌సీడీఏ కమిషనర్‌ నియామకం పూర్తవగానే ఫ్యూచర్‌ సిటీ నిర్మాణం మరింత వేగం పుంజుకుంటుందని అధికారులు చెబుతున్నారు.  

నాలుగేళ్లలో కార్యరూపం.. 
ఇప్పటికే ఫోర్త్‌ సిటీలో యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ నిర్మాణం ప్రారంభమవగా పనులు చకచకా సాగుతున్నాయి. ఉగాది తర్వాత ఆర్టిఫిషియ‌ల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇదే సమయంలో ఫ్యూచర్‌ సిటీకి అన్ని ప్రాంతాల నుంచి అనుసంధానం చేసేందుకు గ్రీన్‌ ఫీల్డ్‌ రేడియల్‌ రోడ్ల నిర్మాణానికి సైతం ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మరోవైపు ఫ్యూచర్‌ సిటీలో పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను సైతం తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. వచ్చే నాలుగేళ్లలో ఫ్యూచర్‌ సిటీకి ఓ రూపం తీసుకువచ్చేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.

చ‌దవండి: కొత్త మెట్రో రైళ్ల‌కు నిధుల బ్రేక్‌!   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)