Breaking News

పిడుగొస్తే.. ఏం చేయాలి?

Published on Mon, 07/22/2024 - 02:50

నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో నివేదిక మేరకు 2022లో ప్రకృతి విపత్తుల కారణంగా మన దేశంలో 8,060 మరణాలు సంభవిస్తే.. అందులో 2,887 మరణాలకు పిడుగుపాటే కారణం.

ప్రతి సెకనుకు భూమిపై 50 నుంచి 100 పిడుగులు పడతాయట.
‘వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియవ’న్నది సామెత. కానీ దేశంలో ఏటా వేలాది మందిని బలిగొంటున్న పిడుగు పాటును మాత్రం ముందే గుర్తించేందుకు చాన్స్‌ ఉంటుంది. ఆకాశం మేఘావృతమై జల్లులు మొదలైతే.. ఉరుములు, మెరుపులు వస్తుంటే.. చాలా మంది ఏ చెట్టు కిందకో పరుగెడుతుంటారు.

అంతేకాదు కారులో ఉంటే పిడుగు పడొచ్చనే భయంతో కిందకు దిగి కాస్త దూరంగా నిలబడుతూ ఉంటారు. కానీ ఇలా చేయకూడదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చిన్నచిన్న జాగ్రత్తలతో పిడుగు ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు. ఇటీవల తెలంగాణలో రైతులు, చిన్నారులు సహా పదుల సంఖ్యలో పిడుగుపాటుతో ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవీ..

పిడుగుపాటు బారిన పడకుండా..

‘దామిని’ ఉంటే తప్పించుకోవచ్చు! 
పిడుగులకు సంబంధించి ముందుగానే హెచ్చరించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘దామిని’అనే యాప్‌ను అందుబాటులోకి తీసుకొచి్చంది. మీరు ఉన్న ఏ ప్రాంతంలోనైనా తర్వాతి 15 నిమిషాల్లో పిడుగులు పడే అవకాశం ఉంటే ఈ యాప్‌ హెచ్చరిస్తుంది. పుణేకు చెందిన ఐఐటీఎం సంస్థ దీన్ని రూపొందించింది.

జీపీఎస్‌ లొకేషన్‌ ఆధారంగా.. మీరున్న చోటేకాదు చుట్టుపక్కల ఎక్కడెక్కడ పిడుగులు పడే అవకాశముందో చెప్తుంది. అంతేకాదు.. గత 15 నిమిషాల్లో ఎక్కడైనా పిడుగుపడితే ఆ సమాచారం కూడా దీనిలో లభిస్తుంది. పిడుగుల విషయంలో ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాన్ని కూడా చెప్తుంది. పిడుగుపాటును ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసే పరిజ్ఞానం ఆంధ్రప్రదేశ్‌ విపత్తు నిర్వహణ శాఖ దగ్గర కూడా ఉంది.    – సాక్షి సెంట్రల్‌ డెస్క్‌

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)