వారసత్వ కట్టడాలకు తెలంగాణ పెట్టింది పేరు: రేవంత్‌రెడ్డి

Published on Mon, 07/29/2024 - 04:50

గోల్కొండ (హైదరాబాద్‌): వారసత్వ కట్టడాలకు, శతాబ్దాల సంస్కృతికి తెలంగాణ పెట్టింది పేరని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన గోల్కొండ కోట సమీపంలోని కుతుబ్‌షాహి సమాధుల ప్రాంగణంలో పునరుద్ధరణ ప్రాజెక్టు ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇతర అధికారులతో కలసి మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ.. శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్‌షాహీలు పాలించిన ఈ ప్రాంతం మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిందని అన్నారు.

రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావడం సంతోషకరమన్నారు. మరిన్ని చారిత్రక కట్టడాలను పునరుద్ధరించి యునెస్కో గుర్తింపు వచ్చేలా కృషి చేస్తామన్నారు. ఆఘాఖాన్‌ ట్రస్ట్‌ ఫర్‌ కల్చర్‌ సంస్థ 106 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంగణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిందని తెలిపారు. ముందు ముందుకూడా చారిత్రక కట్టడాల పునరుద్ధరణ పనుల్లో ఆఘాఖాన్‌ ట్రస్టు ఫర్‌ కల్చర్‌ సంస్థ సేవలను ఉపయోగించుకుంటామని వెల్లడించారు. తెలంగాణలో పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నామని దీని ఫలితంగా రాష్ట్రానికి పర్యాటకుల సంఖ్య పెరిగిందని చెప్పారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యాటక రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. అనంతరం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతూ తాను విద్యారి్థగా ఉన్న సమయంలో కుతుబ్‌షాహీ సమాధుల వద్దకు స్కూల్‌ నుంచి విజ్ఞాన, విహార యాత్రకు వచ్చేవారమని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్స్‌ రహీమ్‌ ఆఘాఖాన్, కార్వాన్‌ ఎమ్మెల్యే కౌసర్, రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి వాణిప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)