Breaking News

ఇక రోడ్డు విశాలం.. ప్రయాణం పదిలం

Published on Mon, 11/03/2025 - 03:42

సాక్షి, హైదరాబాద్‌: చేవెళ్ల రోడ్డు ఎట్టకేలకు లోపాలు సరిదిద్దుకొని విశాలంగా మారనుంది. గత పదకొండేళ్లలో రోడ్డు ప్రమాదాల రూపంలో 300 మంది మృతికి కారణమైన ఈ రోడ్డు మరో రెండేళ్లలో నాలుగు వరుసలుగా మారి ప్రయాణికులు పదిలంగా గమ్యం చేరేందుకు దోహదపడనుంది. ఈ విస్తరణ వల్ల 915 మర్రి చెట్లకు ముప్పు పొంచి ఉందంటూ వృక్ష ప్రేమికులు గతంలో వేసిన కేసు వల్ల జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో కొనసాగుతున్న స్టేకు అడ్డంకులు తొలగనుండటమే అందుకు కారణం. 

రోడ్డు డిజైన్‌ను మార్చడం ద్వారా ఆ చెట్లను కాపాడనున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ చేసిన విన్నపానికి ట్రిబ్యునల్‌ సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో స్టేను ఎత్తేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో రోడ్డు విస్తరణ పనులు మొదలు కానున్నాయి. గతంలోనే టెండర్ల ప్రక్రియను పూర్తి చేయడంతో ఇప్పుడు జాప్యం లేకుండా రోడ్డు పనుల్లో కదలిక రానుంది. 46.405 కి.మీ. నిడివిగల ఈ రోడ్డును 60 మీటర్లకు విస్తరించే పని రెండేళ్లలో పూర్తి చేస్తామని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు అంటున్నారు. 

తెలంగాణ వచ్చాక 300 మరణాలు... 
హైదరాబాద్‌ శివారులోని అప్పా జంక్షన్‌ నుంచి మన్నెగూడ కూడలి వరకు ఉన్న రోడ్డును 60 మీటర్ల మేర నాలుగు వరుసలుగా ఎన్‌హెచ్‌ఏఐ విస్తరించనుంది. ప్రస్తుతం రోడ్డు బాగా ఇరుకుగా ఉండటంతో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. 2014 నుంచి 2025 వరకు జరిగిన ప్రమాదాల్లో ఏకంగా 300 మంది మరణించారు. వాస్తవానికి ఈ రోడ్డును విస్తరించాలని పదేళ్ల క్రితమే నిర్ణయించినా పలు కారణాల వల్ల జాప్యం జరుగుతూ వచ్చింది. 

ప్రధానంగా ఈ మార్గంలో ఉన్న భారీ మర్రి చెట్లు రోడ్డు విస్తరణకు అడ్డంకిగా మారాయి. మిగతా రోడ్లను విస్తరించే సమయంలో భారీ మర్రి చెట్లను తొలగించడంతో ఈ రోడ్డుపై ఉన్న 915 మర్రి చెట్లను కాపాడాకే రోడ్డు విస్తరణ జరిగేలా చూడాలని వృక్ష ప్రేమికులు జాతీయ హరిత ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. అధికారుల వద్ద సరైన ప్రణాళిక లేకపోవడంతో రోడ్డు విస్తరణపై ట్రిబ్యునల్‌ స్టే విధించింది. ఇప్పుడు విస్తరణకు పక్కా ప్రణాళికను రూపొందించి తాజాగా ట్రిబ్యునల్‌కు సమర్పించారు. 

మార్పులతో ముందుకు.. 
రోడ్డు సెంట్రల్‌ మీడియన్‌కు ఉద్దేశించిన ఐదు మీటర్ల స్థలాన్ని ఒకటిన్నర మీటర్‌కు అధికారులు కుదించారు. ఫలితంగా మిగిలే మూడున్నర మీటర్ల స్థలాన్ని రోడ్డు విస్తరణకు జోడించారు. దీనివల్ల రోడ్డు పక్కనున్న చెట్లను తొలగించాల్సిన అవసరం ఉండదని ప్రణాళికలో పేర్కొన్నారు. చెట్లు తక్కువగా ఉన్న వైపు విస్తరణ స్థలాన్ని పెంచడం వల్ల చెట్లు పోకుండా కాపాడతామని తెలిపారు. 

కేవలం 136 వృక్షాలే ఈ డిజైన్‌కు సరిపోవట్లేదని.. వాటిని మాత్రం ఉన్న స్థలం నుంచి తొలగించి ట్రాన్స్‌లొకేట్‌ చేయడం ద్వారా రోడ్డు పక్కన తిరిగి నాటుతామని చెప్పారు. తద్వారా ఒక్క మర్రి చెట్టు కూడా పోకుండా కాపాడే అవకాశం ఉంటుందన్నారు. దీనికి ట్రిబ్యునల్‌ సానుకూలంగా ఉంది. 

కేసు దాఖలు చేసిన వృక్ష ప్రేమికులు ఈ ప్రణాళికను స్వాగతిస్తూనే దాని అమలు విషయంలో లిఖితపూర్వక హామీలు కోరుతున్నారు. వాటిని సోమవారం ట్రిబ్యునల్‌కు సమరి్పంచనున్నారు. ఆ హామీలపై ఎన్‌హెచ్‌ఏఐ లిఖితపూర్వక భరోసా ఇస్తే ట్రిబ్యునల్‌ స్టే ఎత్తేసే అవకాశం ఉంది. 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)