Breaking News

మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోయాలి

Published on Mon, 07/15/2024 - 03:20

గజ్వేల్‌: మేడిగడ్డ వద్ద ప్రస్తుతం 40 వేల క్యుసెక్కుల నీరు ప్రవహిస్తోందని, ప్రభుత్వం పంతాలను మానుకొని నీటిని ఎత్తి పోయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో జరిగిన బోనాల పండుగలో పాల్గొని కౌన్సిలర్‌ గుంటుకు శిరీష తెచ్చిన బోనమెత్తుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. 

ఈ సమయంలో రిజర్వాయర్ల ద్వారా సాగు, తాగు అవసరాలకు గోదావరి జలాలను అందించాల్సిన అవసరముందని అన్నారు. మేడిగడ్డలో బ్యారేజీ గేట్లు తెరిచి ఉన్నా కూడా నదిలో ఉన్న ప్రవాహానికి అనుగుణంగా దాదాపుగా నాలుగు పంపులను నడిపి నీటిని ఎత్తిపోసే అవకాశముందని చెప్పారు. 

మేడిగడ్డ నుంచి సుందిల్ల, అన్నారం, మిడ్‌మానేరు, అనంతగిరి రిజర్వాయర్ల మీదుగా సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌ రిజర్వాయర్లలో వెంటనే నీటిని నింపాలన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికైనా భేషజాలను మానుకోవాలన్నారు.

నిరుద్యోగులను రెచ్చగొడతారా?
వారి సమస్యలను పట్టించుకోరా? 
సీఎంకు హరీశ్‌ రావు బహిరంగ లేఖ 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని నిరుద్యోగులు వారి న్యాయమైన డిమాండ్లు సాధించుకునేందుకు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేస్తుంటే, ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం దారుణమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్‌ రావు విమర్శించారు. పెద్ద మనసుతో వారి సమస్యలకు పరిష్కారం చూపాల్సింది పోయి, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రి స్థాయికి తగదన్నారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.

కాంగ్రెస్‌ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చమని గ్రూప్స్, డీఎస్‌సీ అభ్యర్థులు, నిరుద్యోగులు నెత్తీనోరు కొట్టుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు పరిష్కారం దిశగా ఆలోచన చేయడం లేదని ప్రశ్నించారు. నిరుద్యోగుల పోరాటం వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయంటూ నిందారోపణలు చేయడం ఆక్షేపణీయమని పేర్కొన్నారు. 

ఇలా సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం వల్ల అభ్యర్థులు, నిరుద్యోగుల సమస్యకు పరిష్కారం లభించదని, నిరాహార దీక్షలు చేస్తున్న వారెవరు కూడా పరీక్షలు రాయడం లేదని అపహాస్యం చేయడం వల్ల వారు శాంతించరని హరీశ్‌ అభిప్రాయపడ్డారు. కంచెలు, ఆంక్షలు విధించి నిరుద్యోగుల గొంతులను నొక్కాలనుకున్న మీ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ రేవంత్‌రెడ్డికి రాసిన లేఖలో హరీశ్‌ స్పష్టం చేశారు. నిరుద్యోగుల జీవితాలను దృష్టిలో ఉంచుకొని సానుకూల దృక్పథంతో చర్చలకు ఆహా్వనించాలని కోరారు. 

నాడు వైఎస్‌ చేసినట్టుగా చేయండి.. 
హరీశ్‌ ఏడు ప్రధాన డిమాండ్లను ఆ లేఖలో ప్రస్తావించారు. గ్రూప్‌1లో 1:100 నిష్పత్తితో అభ్యర్థులను అనుమతించాలని, గతంలో వై.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షకి 1:100 నిష్పత్తిలో ఎంపిక చేశారని గుర్తు చేశారు. 

ఇటీవల ఏపీలో నిర్వహించిన గ్రూప్‌2 నోటిఫికేషన్‌ను సవరించి 1:100కు మార్చారని తెలిపారు. గ్రూప్‌2 ,గ్రూప్‌ 3 ఉద్యోగాల సంఖ్యను పెంచాలని, 25వేలతో మెగా డీఎస్‌సీ వేయాలని డిమాండ్‌ చేశారు. రెండు లక్షల ఉద్యోగాలకు జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని కోరారు.  

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)