Breaking News

సాగర్‌ రెండో జోన్‌కు నీటి విడుదల నేడు

Published on Mon, 07/14/2025 - 05:50

కూసుమంచి: పాలేరు రిజర్వాయర్‌ నుంచి జిల్లాలోని సాగర్‌ ఆయకట్టు(రెండో జోన్‌కు)  సోమవారం సాగునీటిని విడుదల చేస్తామని రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పాలేరు వద్ద ఎడమ కాల్వకు చేపట్టిన యూటీ నిర్మాణ పనులను కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టితో కలిసి మంత్రి ఆదివారం రాత్రి పరిశీలించారు. సోమవారం ఉదయమే 1,300 క్యూసెక్కుల నీటి విడుదలకు ఏర్పాట్లు చేయాలని ఇరిగేషన్‌ డీఈఈ మాధవిని ఆదేశించారు. కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు హాజరవుతానని, ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.

గత సెప్టెంబర్‌లో వచ్చిన భారీ వర్షాలకు పాలేరు వద్ద ఎడమ కాల్వ యూటీ కొట్టుకుపోయిందని, ఈ ప్రాంతాన్ని అప్పట్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిశీలించారని గుర్తు చేశారు. సీఎం సూచనలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహకారంతో.. రూ.14.20 కోట్లతో శాశ్వత ప్రాతిపదికన యూటీ, కాలువ మరమ్మతులు చేపట్టామని వివరించారు. ఈ ఏడాది కృష్ణా బేసిన్‌లో వర్షాలు సమృద్ధిగా కురవడంతో.. అనుకున్న సమయానికంటే ముందే రైతులకు సాగునీరు సరఫరా చేస్తున్నామని చెప్పారు. ఆయన వెంట రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ రాయల నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)