Breaking News

సాగర్‌ వైపు కృష్ణమ్మ పరుగులు

Published on Wed, 07/09/2025 - 00:44

సాక్షి, హైదరాబాద్‌:  నాగార్జునసాగర్‌ జలాశయంలో గంటగంటకు నీటిమట్టం పెరుగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తడంతో వరద సాగర్‌ వైపు పరుగులు తీస్తోంది. ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి నిలకడగా వరద కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 6 గంటలకు 1,53,672 క్యూసెక్కుల వరద ఉండగా, జలాశయంలో నీటి నిల్వలు 881 అడుగుల్లో 196.56 టీఎంసీలకు చేరాయి.

జలాశయం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు, గరిష్ట నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, నిల్వలు 199 టీఎంసీలకు చేరడంతో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ప్రాజెక్టు 4 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 1,06,976 క్యూసెక్కుల వరదను కిందకి విడుదల చేశారు. అయితే మంగళవారం రాత్రి 8 గంటల సమయానికి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం 1.86 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. 

నీటి మట్టం 882.2 అడుగులకు పెరిగింది. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా 20 వేల క్యూసెక్కులను ఏపీ, కల్వకుర్తి లిఫ్టు ద్వారా తెలంగాణ 1600 క్యూసెక్కులను తరలించుకుంటున్నాయి. మొత్తం 1.94 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదలవుతున్నాయి. 

ఎగువ నుంచి స్థిరంగా వరద 
ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యామ్‌లలోకి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఆల్మట్టి డ్యామ్‌లోకి 1.08 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. లక్షా 15 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్‌ డ్యామ్‌లోకి 1.14 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1.17 లక్షల క్యూసెక్కులు కిందకు వదిలేస్తున్నారు. దాని దిగువన తెలంగాణలో ఉన్న జూరాల ప్రాజెక్టులోకి 1.25 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. గరిష్ట నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలకు గానూ 7.95 టీఎంసీలను నిల్వ చేస్తూ 1.26 లక్షల క్యూసెక్కులను గేట్లు, విద్యుత్‌ కేంద్రం ద్వారా దిగువకు వదులుతున్నారు. 

మరోవైపు తుంగభద్రలో వరద ఉధృతి కొనసాగుతోంది. డ్యామ్‌లోకి 52 వేల క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. 61 వేల క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. జూరాల, తుంగభద్ర నుంచి విడుదల చేస్తున్న వరద శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండడంతో జలాశయం వేగంగా నిండిపోయింది. 

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్‌కు 1.94 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటంతో నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి. నీటిమట్టం 531.9 అడుగులకు చేరింది. సాగర్‌ గరిష్ట నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 171.88 టీఎంసీలకు చేరింది. వరదలు ఇలానే నిలకడగా కొనసాగితే మరోవారం రోజుల్లో సాగర్‌ నిండే అవకాశం ఉంది.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)