Breaking News

నాలుగడుగుల లోతుల్లోనే నీరు

Published on Sun, 06/30/2024 - 02:52

సాక్షి, కామారెడ్డి : చుట్టు పక్కల గ్రామాల్లో బిందెడు నీళ్లకు గోస పడుతుంటే ఆ ఊళ్లో మాత్రం చేదబావుల్లో నీరు పుష్కలంగా ఊరుతోంది. నాలుగు అడుగుల లోతులో ఉన్న నీళ్లను తోడుకునేందుకు బొక్కెన వేసి రెండు చేతులతో నీటిని పైకి లాక్కుంటారు. కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలం ఉప్పల్‌వాయి గ్రామంలో ఇళ్లల్లో వందకు పైగా చేదబావులు ఉన్నాయి. తాతల కాలం నుంచి ఆ ఊరి జనం చేదబావులను వాడుతున్నారు. 

ఎక్కడ కరువొచ్చినా ఉప్పల్‌వాయిలో మాత్రం నీళ్లకు కరువు అన్న ముచ్చటే తెలియదని గ్రామస్తులు అంటున్నారు. ఇరవై ఏళ్ల నాడు ఒకసారి బావుల్లో నీరు కొంతమేర తగ్గినా, తర్వాతి కాలంలో ఏనాడూ ఊటలు తగ్గలేదని పేర్కొంటున్నారు. ఉప్పల్‌వాయి గ్రామంలో 438 ఇళ్లు ఉన్నాయి. గ్రామ జనాభా 2,478. గ్రామంలో 145 వరకు చేదబావులు ఉన్నాయి. మిషన్‌ భగీరథ నీళ్లు వస్తున్నా, చాలామంది చేదబావుల నీటిని కూడా వాడుతున్నారు. 

కొందరు చేదబావుల్లో మోటార్లు ఏర్పాటు చేసుకోగా, మిగతావారు గిరక ద్వారా చేదుకుంటున్నారు. చాలా ఇళ్ల ముందు చేతబావి కనిపిస్తుంది. బయటకు వెళ్లి వచ్చినవారు బొక్కెనతో నీటిని చేదుకొని కాళ్లు, చేతులు కడుక్కుని ఇంట్లోకి అడుగుపెడుతుంటారు. గ్రామంలో పాత ఇళ్ల వద్ద చేదబావులు ఉన్నాయి. కొత్తగా బంగళాలు నిర్మించుకుంటున్న వారు మాత్రం బోర్లు వేయించుకుంటున్నారు.  

బావులు ఎన్నడూ ఎండిపోలేదు 
నాకు ఇప్పుడు డెబ్బై ఏళ్లపైనే ఉంటయి. నాకు బుద్ధి తెలిసిన నాటి నుంచి బావులు ఎండిపోయింది ఎన్నడూ ఎరుకలేదు. బిందెలతో ముంచుకున్నం. బొక్కెనలతో రెండు చేతులు వేస్తే చాలు నీళ్లు అందుతాయి. మా తాతల కాలం నుంచి ఊళ్లో నీళ్లకు కరు వు లేదు. బావుల్లో నీరు పుష్కలంగా ఉంటోంది.   –ఆల నారాయణ, ఉప్పల్‌వాయి 

అవసరం ఉన్నప్పుడల్లా చేదుకుంటం... 
మా ఇంట్లో రెండు కుటుంబాలున్నాయి. అవసరం ఉన్నప్పుడల్లా బావిలో నుంచి చేదుకుంటాం. రెండుసార్లు చేతులు వేస్తే చాలు బొక్కెన పైకి వచ్చేస్తుంది. నాకు పెళ్లయి ఇక్కడికి వచ్చిన నాటి నుంచి బావుల్లో నీళ్లు ఎండిపోయింది ఎన్నడూ లేదు. నీళ్ల ఇబ్బంది ఎదురు కాలేదు.   – సుతారి మహేశ్వరి, ఉప్పల్‌వాయి 

మా తాత తవ్వించిన బావి...  
మా ఇంటి దగ్గర మా తాతలు తవ్వించిన బావి ఎన్నడూ ఎండిపోలేదు. ఇప్పుడు మేం కూడా బావి నీటిని వాడుకుంటున్నం. బావికి మోటార్‌ బిగించి పైన ట్యాంకుకు కనెక్షన్‌ ఇచ్చాం. ట్యాంకు ద్వారా నీటిని వాడుకుంటున్నాం.  
–శంకర్‌గౌడ్, ఉప్పల్‌వాయి 

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)