Breaking News

భద్రాచలం జిల్లా చుంచుపల్లిలో 44.2 డిగ్రీలు

Published on Wed, 04/17/2024 - 04:58

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గత నాలుగైదు రోజులుగా కాస్త చల్లబడ్డ గరిష్ట ఉష్ణోగ్రతలు మళ్లీ వేగంగా పెరిగాయి. మంగళవారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల సెల్సియస్‌ మేర అధికంగా నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడుగా ఉక్కపోత... పలు ప్రాంతాల్లో వడగాల్పుల ప్రభావంతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

మంగళవారం రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత భద్రాచలంలో 42.6 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 22.3 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 5.1 డిగ్రీ సెల్సియస్‌ అధికంగా నమోదు కాగా, భద్రాచలంలో 3 డిగ్రీలు, నల్లగొండతో పాటు పలు ప్రాంతాల్లో 2 డిగ్రీల సెల్సియస్‌ అధికంగా నమోదు కావడం గమనార్హం. 

పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యాయి. రాష్ట్ర ప్రణాళిక శాఖ వాతావరణ పరిశీలన కేంద్రాల్లో నమోదైన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో అత్యధికంగా భద్రాచలం జిల్లా చుంచుపల్లిలో గరిష్ట ఉష్ణోగ్రత 44.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలో ఇదే అత్యధికం. ఆ తర్వాత నల్లగొండ జిల్లా మాడుగులపల్లిలో 43.8 డిగ్రీలు, ములుగు జిల్లా మంగపేటలో 43.8డిగ్రీలు, నిజామాబాద్‌లో 43.3 డిగ్రీలు, కరీంనగర్‌ జిల్లా వీణవంకలో 43.2 డిగ్రీలు, పెద్దపల్లి జిల్లా మంథనిలో 43.1 డిగ్రీలు, మహబూబా బాద్‌ జిల్లా మరిపెడలో 43.0 డిగ్రీల సెల్సియస్‌ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

నేటి నుంచి మరింతగా 
బుధవారం నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధారణ ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌ మేర అధికంగా నమోదుకావొచ్చని అంచనా వేసింది. రాష్ట్రానికి దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్లు వివరించింది. గరిష్ట ఉష్ణోగ్రతలకు తోడుగా రెండు రోజుల పాటు వడగాల్పులు వీస్తాయని సూచించింది. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)