Breaking News

రంగారెడ్డి: ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి ఆత్మహత్య.. ఏం జరిగింది?

Published on Wed, 12/03/2025 - 07:27

సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. కాగా, అతడి ఆత్మహత్యకు బెదిరింపులే కారణమా? అనే అనుమానం వ్యక్తమవుతోంది.

వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లాలోని ఫరూక్‌ నగర్‌ మండలం కంసాన్‌పల్లి గ్రామానికి చెందిన అవ శేఖర్‌(25) మంగళవారం రాత్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, రవి ఇటీవలే పంచాయతీ ఎన్నికల సందర్బంగా తన గ్రామంలో వార్డు మెంటర్‌గా పోటీ చేసి ఎన్నికల బరిలో నిలిచాడు. ఈ క్రమంలో అతడిని ఎన్నికల్లో నుంచి తప్పుకోవాలనే బెదిరింపులు వచ్చినట్టు సమాచారం.

దీంతో, మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న శేఖర్‌ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఈ సందర్బంగా శేఖర్‌ ఆత్మహత్యకు కారణమైన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని బంధువులు ఆందోళనకు దిగారు. అయితే, ఆధార్ కార్డు ఆధారంగా మృతుడిని శేఖర్‌గా గుర్తించినట్టు రైల్వే పోలీసులు తెలిపారు. అనంతరం, పోస్టుమార్టం కోసం శేఖర్‌ మృతదేహాన్ని మహబూబ్‌నగర్‌ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు.. కంసాన్‌పల్లిలో గ్రామస్థులు పెద్దఎత్తున ుగుమికూడి ఆందోళన చేపట్టారు. శేఖర్‌ ఆత్మహత్యకు కొందరి బెదిరింపులే కారణమని ఆరోపిస్తున్నారు. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)