భార్యపై బెస్‌బాల్‌ బ్యాట్‌తో దాడి చేసిన భర్త!

Published on Tue, 08/04/2026 - 12:20

జనగామ రూరల్‌: భార్యపై భర్త బెస్‌ బాల్‌ బ్యాట్‌తో దాడి చేసిన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ మండలం ఓబుల్‌కేశావాపూర్‌ గ్రామానికి చెందిన మోకు మహేందర్‌రెడ్డి ఎనిమిదేళ్ల క్రితం మాధవిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

 ఇటీవల మహేందర్‌కు మరో మహిళతో పరిచయం ఏర్పడడంతో భార్యాభర్తల మధ్య విభేదాలు మొదలవడంతో మాధవి మే నెలలో సరూర్‌నగర్‌లో తల్లిగారి ఇంటికి వెళ్లిపోయింది. కాగా ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు మాధవి 2వ తేదీన (ఆదివారం) గ్రామానికి వచ్చింది. పంచాయితీకి భర్త రాకపోవడంతో గ్రామ పెద్దమనుషులు ఇంటి తాళం పగలగొట్టి ఉండమని చెప్పి వెళ్లిపోయారు.

అనంతరం సుమారు 4 గంటల సమయంలో మహేందర్‌రెడ్డి ఇంటికి వచ్చి వెంట తెచ్చుకున్న బేస్‌బాల్‌ బ్యాట్‌తో భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అడ్డువచ్చిన మాధవి సోదరుడిని కూడా కొట్టాడు. తీవ్ర గాయాలపాలైన మాధవిని జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించా రు. దాడి అనంతరం మహేందర్‌ రెడ్డి ఇద్దరు పిల్లలను తీసుకుని పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. 

Videos

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)