Breaking News

చేతులు, కాళ్లను చున్నీతో కట్టి.. మరో చున్నీతో మెడ బిగించి..

Published on Sat, 08/02/2025 - 11:04

ఖిలా వరంగల్‌ : ప్రేమించి పెళ్లి చేసున్నాం.. అన్ని మర్చిపోయి సంతోషంగా జీవిద్దామని భార్యను ప్రాధేయపడినా.. మనసు మార్చుకోకపోవడంతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన గురువారం రాత్రి వరంగల్‌ ఏనుమాముల పోలీస్‌ స్టేషన్‌ పరిధి బాలాజీ నగర్‌లోని కమ్మల గుడి సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రితేష్‌ సింగ్‌ ఠాకూర్‌ అలియాస్‌ పడ్డు ఆరేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం వరంగల్‌ వచ్చి కమ్మల గుడి వద్ద నివాసముంటూ ఐస్‌క్రీమ్‌ వ్యాపారం కొనసాగిస్తున్నాడు. ఐదేళ్ల క్రితం రితేష్‌ సింగ్‌ ఠాకూర్‌ను ఏనుమాముల రోడ్డులోని లక్ష్మీ గణపతి కాలనీకి చెందిన ఎండి. మహబూబ్‌ కుమార్తె రేష్మా సుల్తానా ప్రేమించి పెళ్లి చేసుకుంది.

 ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు సురాజ్, సరస్వతి ఉన్నారు. దంపతులు ఐస్‌ క్రీమ్‌ వ్యాపారం నిర్వహించుకుంటూ అన్యోన్యంగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో ఆరునెలల క్రితం రేష్మా సుల్తానాకు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సన్నీతో పరిచయం ఏర్పడింది. సన్నీ, రితేష్‌ సింగ్‌ ఇద్దరు ఉత్తర్‌ ప్రదేశ్‌ వాసులు కావడంతో వీరి మధ్య స్నేహం ఏర్పడింది. సన్నీ తరచూ ఇంటికి రావడంతో రేష్మా సుల్తానా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం రితేష్‌ సింగ్‌కు తెలియడంతో భార్యను మందలించాడు. తర్వాత తమ నివాసాన్ని శాంతినగర్‌కు మార్చాడు. 

మూడు రోజుల క్రితం రేష్మా సుల్తానా బాలాజీ నగర్‌లోని తల్లి ఇంటికి వచ్చింది. ఆ వెంటనే భర్త రితేష్‌ సింగ్‌ కూడా వచ్చి సన్నీని మర్చిపో.. సంతోషంగా జీవిద్దామని రేష్మా సుల్తానాకు సర్ది చెప్పాడు. అనంతరం జూలై 30న తన భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయగా.. ఆమె గర్భవతి అని నిర్ధారణ అయ్యింది. దీంతో భార్యపై కోపం పెంచుకున్నాడు. అనంతరం జూలై 31న రాత్రి 8 గంటలకు రేష్మా సుల్తానా తల్లి ఇంట్లో లేని సమయంలో రితేష్‌ సింగ్‌.. భార్యతో గొడవ పడి ఆమె చేతులు, కాళ్లను చున్నీతో కట్టి, మరో చున్నీతో మెడకు బిగించి ఉరివేసి దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. శుక్రవారం ఉదయం 5.30 గంటలకు రేష్మా     సుల్తానా తల్లి ఇంటికి వచ్చి చూడగా.. కుమార్తె చనిపోయి కనిపించింది. 

సమాచారం అందుకున్న ఏనుమాముల ఇన్‌స్పెక్టర్‌ సురేశ్‌ ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి హత్యకు గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతురాలి సోదరుడు యాకూబ్‌పాషా ‡ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ జే.సురేశ్‌ తెలిపారు.  

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)