Breaking News

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

Published on Wed, 11/05/2025 - 12:03

వనపర్తి: తమ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి హతమార్చిందో భార్య. ఆపై మృతదేహాన్ని మాయం చేసేందుకు సినీ ఫక్కీలో పథకం రచించింది. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలైంది. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ రావుల గిరిధర్‌ వెల్లడించారు. ఆయన వివరాల మేరకు.. 

వనపర్తి పట్టణంలోని గణేశ్‌నగర్‌ కాలనీకి చెందిన కురుమూర్తి, కె.నాగమణి భార్యాభర్తలు. కొన్నాళ్లుగా నాగమణి ఎన్‌.శ్రీకాంత్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అయితే తమ బంధానికి కురుమూర్తి అడ్డొస్తున్నాడని.. ఎలాగైనా హతమార్చాలని పథకం రచించారు. అందులో భాగంగా గతనెల 25న ఇంట్లోనే అతడికి మద్యం తాగించారు. ఆ తర్వాత తాడును గొంతుకు బిగించి హతమార్చారు. 

మృతదేహాన్ని మాయం చేసేందుకు ఓ కారును సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కోసం అద్దెకు తీసుకున్నారు. ఇక్కడి నుంచి శ్రీశైలం సమీపంలోని కృష్ణానది వద్దకు చేరుకొని మృతదేహాన్ని నీటిలో పడేశారు. ఈ క్రమంలో కురుమూర్తి కనిపించడం లేదని అతడి సోదరుడు గతనెల 28న పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టగా, ఈ హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. కృష్ణానదిలో మూడు రోజులపాటు గాలించి శవాన్ని గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. సాంకేతిక ఆధారాలతో హత్య కేసును ఛేదించి.. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా.. రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. 72 గంటల్లో హత్య కేసును ఛేదించిన సీఐ కృష్ణతో పాటు ఎస్‌ఐలు, కానిస్టేబుల్స్‌ను ఎస్పీ అభినందించారు.  

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)