Breaking News

అశోక ధర్మచక్రం ప్రబోధించే విలువల ప్రతిజ్ఞ

Published on Tue, 08/08/2023 - 21:21

సాక్షి, హైదరాబాద్‌: 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘మేరా భారత్ మహాన్’ అనే కార్యక్రమం క్రింద.. విశ్వగురు వరల్డ్‌ రికార్డ్స్‌ సంస్థ ఓ వైవిధ్యమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.  మన జాతీయ పతాకంలోని అశోక ధర్మచక్రంలో గల 24 ఆకులు సూచించే 24 ధార్మిక విలువలను పాటిస్తూ, దేశ పురోభివృద్ధికి పాటుపడుతూ ఆదర్శవంతమైన జీవితం గడుపుతాము అని విద్యార్థులచే సామూహిక ప్రతిజ్ఞ నిర్వహింపజేస్తోంది. 

ఆగస్టు 14వ తేదీ ఉదయం 9-10 గంటల మధ్య జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పాల్గొనేలా తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సహకరిస్తోంది.  ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సంస్థ వెబ్ సైట్ www.viswaguruworldrecords.com లోని గూగుల్ ఫామ్ ను పూరించి సంబంధిత పాఠశాలలు, కళాశాలలు తదితర సంస్థలు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుంది. ఈ సంస్థలన్నింటికీ పార్టిసిపేషన్ ఈ-సర్టిఫికెట్స్ ఉచితంగానే అందిస్తారు. 

ఈ ప్రతిజ్ఞ ద్వారా అశోక ధర్మ చక్రంలోని 24 ఆకులు సూచించే 24 విలువల ప్రాముఖ్యం గురించి తెలుసుకోవడంతో పాటు, ఆ గుణాలను అలవర్చుకొని జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి ఎంతగానో ఉపకరిస్తుందని విశ్వగురు వరల్డ్‌ రికార్డ్స్‌ సంస్థ భావిస్తోంది.  అలాగే మన రాష్ట్రం తో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమం లో అందరూ పాల్గొని ఇతరులూ పాల్గొనే విధంగా చైతన్య పరచి దేశభక్తి చాటాలని విశ్వగురు వరల్డ్  రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపక సిఈవో, ప్రముఖ నాసికా చిత్రకారుడు సత్యవోలు రాంబాబు కోరుతున్నారు.

ఇదీ చదవండి: ఒక్కరోజే 50 లక్షలు?.. అదీ క్రేజ్‌ మరి!

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)