Breaking News

హైదరాబాద్‌లో 59 రూపాయలకే చికెన్‌ బిర్యానీ..ఎక్కడో తెలుసా

Published on Sun, 04/02/2023 - 16:06

ఫుడ్‌ అన్నింటిలోనూ బిర్యానీకి క్రేజే వేరు. స్నాక్స్‌, స్టాటర్స్‌ అన్నింటికంటే ఎక్కువగా ఇష్టపడి తినేది బిర్యానీనే.. ఘుమ ఘుమలాడే బిర్యానిని టేస్ట్ చేయని వారు ఎవరు ఉంటారు చెప్పండి. వారానికి ఒకసారి అయినా బిర్యానీ నోట్లో పడాల్సిందే. అంతలా ఇష్టపడుతుంటారు. దేశంలో బిర్యానీ ప్రియుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కస్టమర్ల అభిరుచికి, ఆదరణకు తగినట్లుగా సరికొత్త పద్ధతి రుచుల్లో  ఫుడ్‌ అందుబాటులోకి వస్తున్నాయి.

అయితే ఏ హోటల్‌, రెస్టారెంట్‌కు వెళ్లినా బిర్యానీ ధర ఎంత కాదన్న 200 ఉంటుంది. రెస్టారెంట్‌, టేస్ట్‌ను బట్టి ఇంక ధర ఎక్కువ కూడా ఉంటుంది. కానీ ఎప్పుడైనా బిర్యానీని రూ.59 రూపాయలకే రుచి చూశారా?.. వినడానికి ఆశ్యర్యంగా ఉంది కదూ!.. కానీ ఓ హోటల్‌ వాళ్లు నిజంగానే 59 రూపాయలకు బిర్యానీని అందిస్తున్నారు. ఈ బిర్యానీ పాయింట్‌ ఎక్కడో కాదు మన హైదరాబాద్‌లోనే.

‘కాకా 55’ బిర్యానీ పాయింట్లో 59 రూపాయలకే చికెన్ బిర్యానీ లభిస్తోంది. దమ్‌ బిర్యానీ 59 రూపాయలు ఉండగా.. ఇద్దరు తినాలనుకుంటే 120 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంతేగాక ఫ్రై బిర్యానీ కూడా రూ. 70కే దొరుకుతుంది. వీరికి హైదరాబాద్‌లో 3 ఔట్‌లెట్స్‌ ఉన్నాయి. నాంపల్లి బీజేపీ కార్యాలయం, కూకట్‌పల్లి సెకండ్‌ ఫేజ్‌, మూడో ఫేజ్‌ దగ్గర ఉన్నాయి. ఒక్కో హోటల్‌ వద్ద రోజూ 250 ప్లేట్స్‌ వరకూ సేల్స్‌ చేస్తున్నారు.

ఆర్డర్లపై కూడా  బిర్యానీ తయారు చేసి అందిస్తారు. ఏ పార్టీ ఉన్నా ఒక రోజు ముందు చెప్తే నోరూరించే బిర్యానీ ఆర్డర్‌ మనముందు ఉంచుతారు. కాస్ట్ తక్కువ ఉన్నా.. రుచి సూపర్గా ఉంటుందని అక్కడ తిన్నవారు చెబుతున్నారు. ఇంత తక్కువ ధరకు బిర్యానీ లభించడం హైదరాబాద్లోనే ఫస్ట్ టైం. మరి మీరూ కూడ టేస్ట్‌ చేయాలనుకుంటే కాకా 55 బిర్యానీ వద్దకు వెళ్లాల్సిందే.. వీళ్లకు స్విగ్గీ జొమాటలో కూడా సదుపాయం ఉంది. 

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు