Breaking News

కీడొచ్చి.. వర్షాలు కురుస్తలేవని..

Published on Mon, 07/21/2025 - 13:33

నల్లగొండ జిల్లా: గ్రామానికి కీడు వచ్చిందని.. అందుకే వర్షాలు కురుస్తలేవని ప్రజలంతా ఊరు విడిచి వనవాసం వెళ్లిన సంఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని తక్కెళ్లపహాడ్‌ గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామంలో రెండు నెలల్లో ఎనిమిది మంది వివి« ద కారణాలతో మృతి చెందారు. గ్రామంలో ఒకరు మృతి చెందగా, అతడి దశదినకర్మ పూర్తికాక ముందే మరొకరు మృతి చెందడం రెండు నెలలుగా జరుగుతోంది. దీనికి తోడు వానాకాలం సీజన్‌ ప్రారంభం కావడంతో గ్రామ రైతులు పత్తితోపాటు ఇతర మెట్ట, వరి పంటలను సాగుచేశారు. 

వర్షాలు కురవకపోవడంతో పత్తి విత్తనాలు మొలకెత్తక రెండు, మూడుసార్లు పత్తి గింజలను విత్తారు. బోరుబావుల్లో సరిపడా నీళ్లు అందక భూములు తడవక పోవడంతో వరినార్లు ముదిరిపోతున్నాయి. గ్రామంలో వరుస మరణాలు జరగడం.. వర్షాలు కురవకపోవడానికి కీడే కారణమని భావించిన గ్రామస్తులు ఒక్కరోజు ఊరు విడిచిపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం శనివా రం రాత్రి గ్రామంలో దండోరా వేయించారు. అందరూ ఊరు విడిచి వెళ్లాలని, గ్రామంలో ఒక్కరు కూడా ఇంట్లో పొయ్యి వెలిగించొద్దని, కిరాణ, మద్యం బెల్టు దుకాణాలు తెరవొద్దని, కోళ్లు, మేకలను కోయొద్దని దండోరా వేయించారు. 

ఊరు విడిచి వెళ్లకున్నా, దుకాణాలు తెరిచినా రూ.5 వేలు, గ్రామంలో కోళ్లు, మేకలు కోసి మాంసం విక్రయిస్తే రూ.10 వేలు జరిమానా విధిస్తామని దండోరా వేయించారు. దీంతో గ్రామస్తులంతా ఆదివారం ఉదయం 6 గంటలకే గ్రామాన్ని విడిచి చెట్లకిందకు వనవాసం వెళ్లి అక్కడే వంటలు చేసుకొని ఆరగించి సాయంత్రం 6 గంటలకు ఇళ్లకు చేరుకున్నారు. ఇదిలా ఉండగా గ్రామంలో ఓ సామాజిక వర్గానికి చెందిన వారు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద చెక్క కర్రలతో ఏర్పాటు చేసిన మంట నుంచి ప్రజలు నిప్పు కొనుగోలు చేసి తమ ఇళ్లలోకి తీసుకెళ్లిన తర్వాతే ఇంట్లో పొయ్యి వెలిగించుకొని వంట చేసుకోవాలని హుకుం జారీ చేయడంతో ప్రజలు తప్పని పరిస్థితుల్లో పాటించక తప్పలేదు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)