Breaking News

ఆదిలాబాద్: అటవీ శాఖ సిబ్బందిపై గ్రామస్తుల రాళ్ల దాడి

Published on Sun, 01/05/2025 - 16:24

సాక్షి, ఆదిలాబాద్ జిల్లా: అటవీ అధికారులపై గ్రామస్తులు దాడి చేశారు. ఇచ్చోడ మండలం కేశవపట్నంలో ఘటన జరిగింది. తెల్లవారుజామున కేశవపట్నం గ్రామంలో అటవీ అధికారులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. కార్డెన్ సెర్చలో పలు ఇళ్లలో కలప దుంగలు, ఫర్నిచర్ దొరికాయి. కలప దుంగలు స్వాధీనం చేసుకుంటున్న క్రమంలో అటవీ అధికారులపై గ్రామస్తులు రాళ్లతో దాడి చేశారు. దీంతో అటవీ సిబ్బంది భయంతో పరుగులు తీశారు.

ఈ ఘటనలో ఇద్దరు అటవీశాఖ సిబ్బందికి గాయాలయ్యాయి. అటవీ శాఖ వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఈ ఘటనలో  బీట్ ఆఫీసర్ జాధవ్ నౌశిలాల్ స్వల్పంగా గాయపడ్డారు. అటవీ శాఖకు సంబంధించిన ఓ వాహనంంపై దాడి చేసిన స్థానికులు అద్దాలు పగలగొట్టారు. కేశవపట్నం చేరుకున్న పోలీసు బలగాలు.. గ్రామాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. దాడి విషయాన్ని అటవీ శాఖ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.

ఇదీ చదవండి: మాదాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు
 


 

 

 

 

 

 

 

 

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)