Breaking News

డబ్బులు పంపుతావా.. జైలుకు వెళ్తావా

Published on Sat, 12/27/2025 - 10:25

వికారాబాద్ జిల్లా: ‘డబ్బులు పంపు. లేదంటే జైలుకు పంపిస్తాను. చంపేస్తా’ అని గుర్తు తెలియని వ్యక్తి బెధిరింపు ఫోన్‌కాల్స్‌తో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన చన్గోముల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ భరత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధి రాకంచర్ల గ్రామానికి చెందిన వడ్త్యా రాఘవన్‌ అలియాస్‌ పవన్‌(26) స్థానికంగా కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. కొన్ని రోజులుగా రెండు సెల్‌ఫోన్‌ నంబర్లతో.. ఓ వ్యక్తి క్రైమ్‌ కానిస్టేబుల్‌ అని, కంట్రోల్‌ రూం నుంచి మాట్లాడుతున్నానని వివిధ రకాలుగా బెధిరించి డబ్బులు వేయమని వేధించసాగాడు. 

డబ్బులు పంపకుంటే జైలుకు పంపిస్తానని, చంపేస్తానని బెధిరించాడు. దీంతో మనస్తాపంచెందిన పవన్‌.. ఈ నెల 23న రాకంచర్ల ఇండస్ట్రీయల్‌ పార్కు ప్రాంతంలో పురుగు మందు తాగి, బలవన్మరణానికి పాల్పడ్డాడు. వికారాబాద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. మృతుడి కాల్‌డేటా ఆధారంగా హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిపై అనుమానం ఉండటంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుడిని డబ్బుల కోసం ఫోన్లో వేధించినట్లు గుర్తించారు. మృతుడి అన్న విఠల్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)