Breaking News

హత్య చేసి.. పక్కింటి దూలానికి వేలాడదీసి!

Published on Thu, 03/12/2026 - 14:07

వికారాబాద్: వీధి నాటకం చూసి వస్తానని వెళ్లిన ఓ మహిళ.. పక్కింట్లో దూలానికి వేళాడుతూ విగతజీవిగా కనిపించగా.. ఆమెను చంపి, దూలానికి వేళాడదీశారని మృతురాలి భర్త అనుమానం వ్యక్తం చేశారు. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధి కుప్పగిరి గ్రామానికి చెందిన మదరప్ప, అశోక్‌ కుటుంబ సభ్యులకు నాలుగు రోజుల క్రితం భూ విషయంలో పంచాయితీ జరిగింది. ఇరు వర్గాలు దాడి చేసుకున్నాయి. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. అక్కడే పెద్దల సమక్షంలో రాజీ కుదుర్చుకొని, ఇకముందు ఎలాంటి గొడవలు చేసుకోమని హామీపత్రం రాసుకున్నారు. 

మారుమారు దాడి.. 
అలా పెద్దల మధ్య ఒప్పందం రాసుకున్న వారు.. భూ విషయంలో మంగళవారం ఉదయం మరోసారి గొడవకు దిగారు. ఇందులో అశోక్‌ భార్య కృష్ణవేణి(31)పై మదరప్ప కుటుంబ సభ్యులు దాడి చేసి, గాయపర్చారు. కాగా.. అదే రోజు రాత్రి గ్రామంలో ప్రదర్శించిన నాటకం చూడటానికి వెళ్తానని చెప్పిన సదరు మహిళ.. తెల్లవారే సరికి పక్కింట్లో దూలానికి ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. దీంతో తన భార్యను మదరప్ప కుటుంబ సభ్యులు హత్యచేసి, ఇలా ఉరి వేశారని మృతిరాలి భర్త, కుటుంబీకులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. 

పరిసరాలను పరిశీలించి, శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొడంగల్‌ ఆస్పత్రికి తరలించారు. హత్యకు పాల్పడిన వారిని అరెస్టు చేయాలని బాధిత కుటుంబీకులు ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు. కొడంగల్‌ సీఐ శ్రీధర్‌రెడ్డి, ఎస్‌ఐ రాజుకుమార్‌ బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఆందోళనను  విరమింపజేశారు. మృతురాలి భర్త అశోక్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.  

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు