Breaking News

వసంతా.. నిన్ను చంపి నీ భర్తతోనే సంసారం చేస్తా!

Published on Sat, 01/31/2026 - 12:42

వికారాబాదు జిల్లా: ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన మండల పరిధిలోని బిల్‌కల్‌లో శుక్రవారం ఉదయం వెలుగుచూసింది. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చేరాల నర్సింలు (39) వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం సాగిస్తున్నాడు. ఈ విషయమై ఇరు కుటుంబాల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. మూడు నెలలుగా తన ప్రియురాలితో నర్సింలు కొంత దూరంగా ఉంటున్నాడు. దీంతో ఆమె తరచూ నర్సింలుకు ఫోన్‌ చేస్తోంది. నర్సింలు ఆమెతో మాట్లాడుతుండగా భార్య వసంత ఫోన్‌ లాక్కుని హెచ్చరించింది. దీంతో ఆగ్రహానికి లోనైన నర్సింలు ప్రియురాలు వసంతను దుర్భాషలాడింది. నిన్ను చంపి, నీభర్తతోనే ఉంటానని హెచ్చరించింది. ఇదిలా ఉండగా గురువారం రాత్రి 8 గంటల సమయంలో ఇంట్లో భోజనం చేసిన నర్సింలు పొలం వద్దకు వెళ్తున్నానని చెప్పి బయల్దేరాడు. ఉదయం పొద్దుపోయినా తిరిగి రాకపోవడంతో వసంత ఫోన్‌ చేయగా స్విచ్ఛాప్‌ వచ్చింది. కొద్ది సమయం తర్వాత గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో నర్సింలు విగత జీవిగా, రక్తపు మడుగులో పడి ఉన్నాడని సమాచారం అందింది.

డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు
విషయం తెలుసుకున్న మర్పల్లి ఎస్‌ఐ రవూఫ్‌, మోమిన్‌పేట్‌ సీఐ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేయగా ఘటనా స్థలం వద్ద పలు బండరాళ్లను గుర్తించారు. అక్కడి నుంచి కిలోమీటర్‌ దూరంలో ఉన్న ఓ వెంచర్‌ వద్దకు వెళ్లిన జాగిలం అక్కడే ఆగిపోయింది.

కుటుంబీకుల ఆందోళన
నిందితులను గుర్తించే వరకూ శవాన్ని పోస్టుమార్టానికి తరలించేది లేదని మృతుడి బంధవులు, కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. హత్యకు పాల్పడిన వారిని త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో బాడీని మర్పల్లి ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య వసంత, కుమారులు సాయికృష్ణ, శ్రీహరి ఉన్నారు. ఇదిలా ఉండగా గ్రామానికి చెందిన బేగరి నర్సమ్మ, ఆమె భర్త పాపయ్య కలిసి తన భర్తను బండరాళ్లతో కొట్టి హత్య చేశారని వసంత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)