Breaking News

గుర్రం విజయలక్ష్మి అరెస్ట్..

Published on Fri, 01/31/2025 - 08:22

దుండిగల్‌: నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టడమేగాక, వినియోగదారులను మోసం చేసి రూ.కోట్లు సంపాదించింది. పోలీసు కేసులు నమోదు కావడంతో  దేశం విడిచి పారిపోయేందుకు యత్నించిన ఓ నిర్మాణ సంస్థ యజమానురాలిని దుండిగల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మేడ్చల్‌ జిల్లా దుండిగల్‌ మున్సిపాలిటీ పరిధిలో మల్లంపేటలోని సర్వే నెంబర్‌ 170/3, 170/4, 170/5లోని 15 ఎకరాల భూమిని పాతికేళ్ల క్రితం ముగ్గురు స్వాతంత్ర సమరయోధులకు అప్పటి ప్రభుత్వం కేటాయించింది. ఆ తర్వాత సదరు భూమి పలువురి చేతులు మారి చివరికి కొన్నేళ్ల క్రితం శ్రీ లక్ష్మీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్‌ సంస్థకు చేరింది. 

సంస్థ నిర్వాహకురాలు గుర్రం విజయలక్ష్మి ఐదేళ్ల క్రితం 3.20 ఎకరాల్లో 65 విల్లాల నిర్మాణం కోసం హెచ్‌ఎండీఏకు దరఖాస్తు చేసుకుంది. ఆ తర్వాత సదరు సంస్థ ఎలాంటి అనుమతులు లేకుండానే పక్కనే ఉన్న కత్వ చెరువుకు సంబంధించిన 16 గుంటల ఎఫ్‌టీఎల్, మూడు ఎకరాల బఫర్‌ జోన్‌ను ఆక్రమించి ఏకంగా 300కు పైగా విల్లాలను నిరి్మంచింది. దీనిపై స్థానికులు పలుమార్లు మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.  

బఫర్‌ జోన్, ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని 11 అక్రమ విల్లాలను గత  సెప్టెంబరులో అధికారులు కూల్చివేశారు.  అంతేగాక ఇరిగేషన్‌ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టారని దుండిగల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి తోడు తమకు అన్ని సదుపాయాలు  కల్పిస్తామని చెప్పి మోసం చేశారని,  రిజి్రస్టేషన్లు సైతం చేసుకుని బ్యాంకుల్లో రుణాల్లో తీసుకుని రూ. లక్షలు వెచ్చించి ప్లాట్లను కొనుగోలు చేశామని, చివరికి తమ విల్లాలను కూల్చివేశారని, సంస్థ నిర్వాహకురాలు గుర్రం విజయలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని బాధితులు దుండిగల్‌ పోలీసులను ఆశ్రయించారు. 

విజయలక్ష్మిపై ఇప్పటి వరకు ఏడు కేసులు నమోదు చేసిన పోలీసులు లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేశారు. కాగా గురువారం తెల్లవారుజామున దేశం విడిచి పారిపోయేందుకు ప్రయతి్నంచిన ఆమెను శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని దుండిగల్‌ పోలీసులకు అప్పగించారు. వారు ఆమెను న్యాయమూర్తి ఎదుట హాజరు పరచడంతో 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు.  

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)