Breaking News

రైస్‌మిల్లులపై విజిలెన్స్‌ దాడులు

Published on Thu, 11/13/2025 - 04:25

వనపర్తి: జిల్లాలో విజిలెన్స్‌ అధికారుల ఆకస్మిక దాడులతో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారుల పర్యవేక్షణ లోపం ఈ ఘటనతో కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. విజిలెన్స్‌ ఎస్పీ ఆనంద్‌కుమార్‌కు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం డీఎస్పీ శ్రీనివాస్‌ నేతృత్వంలో విజిలెన్స్‌ దాడులు కొనసాగాయి. 

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్ల శివారులోని చాముండి మిల్లులో 97 వేల బస్తాలు, వారాహి మిల్లులో 37 వేల ధాన్యం బస్తాలు తక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు విజిలెన్స్‌ డీఎస్పీ వెల్లడించారు. మిల్లుల్లో ఉండాల్సిన ధాన్యం కంటే రూ.12.50 కోట్ల విలువైన ధాన్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. 

ఈ విషయాన్ని రాష్ట్రస్థాయి అధికారులకు నివేదించనున్నట్లు విజిలెన్స్‌ తహసీల్దార్‌ రాజశేఖర్, సీఐ గణేశ్, డీసీటీఓ సురేశ్‌ తెలిపారు. రెండు మిల్లుల్లో ధాన్యం బస్తాల లెక్కింపు సమయంలో వనపర్తి డీఎస్‌ఓ, డీటీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తదితరులున్నారు. 

కలెక్టర్‌ తనిఖీ చేసిన మరునాడే.. 
ప్రస్తుత వానాకాలం వరి ధాన్యం కేటాయింపుల్లో భాగంగా ఆయా మిల్లులకు ధాన్యం కేటాయింపుతో పాటు ఇతర అంశాలపై కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి మంగళవారం తనిఖీ చేశారు. మరునాడే విజిలెన్స్‌ అధికారుల బృందం దాడులు నిర్వహించి రూ.కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టినట్లు గుర్తించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)