Breaking News

బట్టతలపై జుట్టు అనగానే.. ఉప్పల్‌లో క్యూ కట్టిన జనం.. షాకిచ్చిన పోలీసులు

Published on Wed, 04/23/2025 - 15:54

సాక్షి, హైదరాబాద్: ఉప్పల్‌లో బట్టతల మందు కోసం బాధితులు క్యూ కట్టారు. ఉప్పల్ బాగాయత్‌లో ఏర్పాటు చేసిన శిబిరం.. వేలాది మంది బట్టతల బాధితులతో నిండిపోయింది. వెయ్యి రూపాయలు పెట్టి బట్టతలకు బాధితులు మందు తీసుకుంటున్నారు. 300 ఎంట్రీ ఫీజు.. 700 ఆయిల్ కాస్ట్ అంటూ హరీశ్ అనే వ్యక్తి భారీగా డబ్బులు వసూళ్లు చేస్తున్నాడు. ఢిల్లీ నుంచి ఫ్రాంచైజ్ తీసుకొని బట్టతలకు ఆయిల్ ఇస్తామంటూ మోసానికి పాల్పడుతున్న హరీష్‌, వినోద్, రాజశేఖర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గతంలో కూడా బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తానని ఓ యువకుడు పాతబస్తీలో హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీకి చెందిన వకీల్‌ గత కొంత కాలంగా పాతబస్తీ రామనాస్పుర రోడ్డులో కింగ్‌ పేరుతో కటింగ్‌ షాపును నిర్వహిస్తున్నాడు. నెల రోజుల నుంచి బట్టతలపై జుట్టు మొలిపిస్తానంటూ ప్రచారం చేయడంతో పెద్ద ఎత్తున యువకులు క్యూలో నిలబడి మందు పెట్టించుకున్నారు. ఈ వార్త సోషల్‌ మీడియాలో కూడా వైరల్‌గా మారింది.

వకీల్‌ మొదట బట్టతల గుండు కొట్టి రూ.100 తీసుకొని తర్వాత జుట్టు మొలిపించేందుకు కెమికల్‌ను బట్టతలపై రాసేవాడు. ఉన్న కాస్త జుట్టు కూడా పోయిందంటూ ఆందోళనకు గురయ్యారు.
 

 

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)