Breaking News

డిజిటల్‌ కర్ఫ్యూ!

Published on Thu, 07/16/2026 - 04:32

సాక్షి, హైదరాబాద్‌: అర్ధరాత్రి దాటినా స్మార్ట్‌ఫోన్లలో గంటలకొద్దీ ఆన్‌లైన్‌ గేమ్స్‌.. సోషల్‌ మీడియాలో చాటింగ్‌లు.. తల్లిదండ్రులు వద్దని వారించినా, ఆరో గ్యం పాడవుతున్నా లెక్కలేనితనం... ఇదీ భారత్‌ సహా అనేక దేశాల్లో స్మార్ట్‌ఫోన్లకు బానిసలవుతున్న పిల్లలు ముఖ్యంగా టీనేజర్ల పరిస్థితి. ఈ విషయంలో నియంత్రణ చర్యలు చేపట్టేందుకు భారత్‌ ఇంకా కసరత్తు చేస్తుంటే వివిధ దేశాలు మాత్రం చట్టబద్ధంగా ముందుకు కదిలాయి. 

నిర్ణీ త సమయం దాటితే ఇంటర్నెట్‌కు తాళం పడే విధానాన్ని అమలు చేస్తున్నాయి. రాత్రి 10 గంటలు దాటగానే సోషల్‌ మీడి యా ఓపెన్‌ కాకుండా, పబ్‌జీ వంటి ఆన్‌లైన్‌ గేమ్స్‌ రన్‌ కాకుండా కట్టడి చేస్తున్నాయి. దీంతో టైమ్‌ దాట గానే.. పిల్లలు ఎంత ప్రయత్నించినా సంబంధిత యాప్స్‌ పనిచేయట్లేదు. ఇంకొన్ని దేశాలైతే మరో అడుగు ముందుకేసి ఇంటర్నెట్‌నే బంద్‌ చేస్తున్నా యి. దీన్నే డిజిటల్‌ కర్ఫ్యూగా వ్యవహరిస్తున్నాయి. 

ఎలాంటి నిబంధనలు ఉన్నాయంటే.. 
డిజిటల్‌ కర్ఫ్యూ అమల్లో చైనా అందరికంటే ముందుంది. స్మార్ట్‌ఫోన్లలో ‘మైనర్‌ మోడ్‌’ను చైనా ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీంతో ఫోన్ల తయారీదారులు 18 ఏళ్ల లోపు పిల్లలకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఫోన్లలో ఇంటర్నెట్‌ ఆటోమేటిక్‌గా కట్‌ అయ్యేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. పిల్లల వయసును బట్టి రోజుకు 40 నిమిషాల నుంచి గరిష్టంగా రెండు గంటలు మాత్రమే స్క్రీన్‌ టైమ్‌ వెసులుబాటు లభిస్తోంది. అలాగే ఆస్ట్రేలియా 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్‌ మీడియా వాడకంపై నిషేధం విధించింది. నిబంధనలు పాటించని కంపెనీలకు భారీ జరిమానాలు విధిస్తోంది.

బ్రిటన్‌ ప్రభుత్వం 16, 17 ఏళ్ల టీనేజర్ల కోసం రాత్రివేళల్లో లైవ్‌ స్ట్రీమింగ్స్, మెసేజింగ్‌ ఫీచర్లను డిఫాల్ట్‌గా లాక్‌ చేసే విధానాలను తెస్తోంది. ఫ్రాన్స్‌ స్కూళ్లలో స్మార్ట్‌ఫోన్లను నిషేధించడంతోపాటు రాత్రివేళల్లో స్క్రీన్‌ టైమ్‌ నియంత్రణలపై గట్టిగా కసరత్తు చేస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికి రాత్రిపూట ఇంటర్నెట్‌ ఆపేలా డిజిటల్‌ కర్ఫ్యూ చట్టాలు చేయకపోయినా డిజిటల్‌ అడిక్షన్‌ కట్టడిపై దృష్టిపెట్టింది. ఆన్‌లైన్‌ గేమింగ్‌ వ్యసనాన్ని అరికట్టడానికి టైమ్‌ లిమిట్స్, ఏజ్‌ వెరిఫికేషన్, పేరెంటల్‌ కంట్రోల్స్‌ లాంటి నిబంధనలను ప్రభుత్వం తీసుకొచి్చంది.  

ఎందుకీ కట్టడి.. 
» రాత్రివేళల్లో ముఖ్యంగా లైట్లు ఆర్పేసి చీకట్లో గంటల తరబడి బ్లూ స్క్రీన్ లైట్‌ని చూడటం వల్ల కంటి సమస్యలు తలెత్తుతున్నాయి. 
»   నిద్రకు కారణమయ్యే మెలటోటిన్‌ హార్మోన్‌ విడుదల కాకపోవడం వల్ల స్మార్ట్‌ఫోన్లకు బానిసలవుతున్న పిల్లల్లో నిద్రలేమి ఎక్కువగా ఉంటోంది. పీడియాట్రిక్‌ వైద్యులు చెప్పే దాని ప్రకారం రాత్రివేళల్లో కళ్లపై బ్లూలైట్‌ పడితే నిద్ర హార్మోన్‌ 60 శాతం తగ్గుతుంది. దీంతో పిల్లల ఎదుగుదల, జ్ఞాపకశక్తి, చదువు దెబ్బతింటాయి. 
»   టీనేజర్లపై సైబర్‌ బుల్లీయింగ్, ఆన్‌లైన్‌ వేధింపులు ఎక్కువగా రాత్రివేళల్లోనే జరుగుతున్నాయి. 
»  ప్రపంచ ఆరోగ్య సంస్థ 2025 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 12–18 ఏళ్ల పిల్లల్లో 42 శాతం మంది రోజుకు 6 గంటలకు పైగా స్క్రీన్‌ చూస్తున్నారు. దీంతో నిద్రలేమి, ఒత్తిడి, డిప్రెషన్‌ కేసులు 3 రెట్లు పెరిగాయి. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)