Breaking News

హైదరాబాద్‌లో వాన్‌గార్డ్‌ తొలి జీసీసీ

Published on Tue, 04/01/2025 - 04:55

సాక్షి, హైదరాబాద్‌: అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక సంస్థ ‘వాన్‌గార్డ్‌’ తొలిసారిగా భారతదేశంలో అంతర్జాతీయ సామర్థ్య కేంద్రం (గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌)ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. ఈ ఏడాది చివరిలోగా ఈ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు.. రానున్న నాలుగేళ్లలో 2,300 మందికి ఉపాధి కల్పించనున్నట్లు ప్రకటించింది, వాన్‌గార్డ్‌ దాదాపు ఐదు కోట్ల మంది పెట్టుబడిదారులతో సుమారు 10.4 ట్రిలియన్‌ డాలర్ల సంస్థగా కొనసాగుతోంది. 

వాన్‌గార్డ్‌ సీఈవో సలీం రాంజీ, ఐటీ డివిజన్‌ సీఈవో, ఎండీ నితిన్‌ టాండన్, మానవ వనరుల ప్రధానాధికారి జాన్‌ కౌచర్, జీసీసీ–ఇండియా వాన్‌గార్డ్‌ హెడ్‌ వెంకటేశ్‌ నటరాజన్‌లు సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రితోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

ముఖ్యమంత్రితో జరిగిన చర్చల అనంతరం వాన్‌గార్డ్‌ తన నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రస్తుతం ప్రకటించిన ఈ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ ఈ సంవత్సరం చివరి నాటికి నగరంలో పనిచేయడం ప్రారంభిస్తుందని ఆ సంస్థ సీఈవో ప్రకటించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే ఈ జీసీసీ ఇన్నోవేషన్‌ హబ్‌గా పనిచేస్తుందని చెప్పారు. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, మొబైల్‌ ఇంజనీరింగ్‌ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో అందుకు అవసరమైన ఇంజనీర్లను తక్షణమే నియమించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..హైదరాబాద్‌లో వాన్‌గార్డ్‌ జీసీసీ ఏర్పాటుకు ముందుకు రావటం ఆనందంగా ఉందని అన్నారు. తెలంగాణ రైజింగ్‌ విజన్‌లో భాగంగా హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి జీసీసీ గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. వాన్‌గార్డ్‌ రాకతో ప్రపంచ స్థాయిలో హైదరాబాద్‌ మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం తరఫున తగినంత సహకారం అందిస్తామని కంపెనీ ప్రతినిధులకు సీఎం భరోసా ఇచ్చారు. తమ వినియోగదారులకు ప్రపంచస్థాయి సేవలను అందించటంతో పాటు ఏఐ, మొబైల్, క్లౌడ్‌ టెక్నాలజీలో ప్రతిభావంతులైన ఇంజనీర్లకు అవకాశాలు కల్పించటం తమకు సంతోషంగా ఉందని సలీం రాంజీ తెలిపారు.   

Videos

హెరిటేజ్ లో పాలు అమ్మినట్టు.. టీచర్ పోస్టులను అమ్మేశారు

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం!

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

ACల దొంగలు.. వైరల్ అవుతున్న వీడియో

ధురంధర్ డైరెక్టర్ తో టాక్సిక్ హీరో.. పాన్ ఇండియా షేక్ చేసే కాంబో?

శ్రీ చరణి దెబ్బ అదుర్స్! 55 పరుగులకే పాక్ ఆలౌట్..

టీచర్ ఉద్యోగం కోసం 12 లక్షలు అడిగారు.. లోకేష్ మనుషులు వచ్చి మాట్లాడుతారు అంటూ..

SBI గుడ్ న్యూస్.. రూ.15 లక్షల స్కాలర్ షిప్!

10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!

Photos

+5

'అంతా రాములోరు చూసుకుంటారు' మూవీ టైటిల్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)