Breaking News

సీఎంతో వంశీచంద్‌రెడ్డి భేటీ

Published on Sat, 12/30/2023 - 01:49

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డితో ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌ చార్జి కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి భేటీ అయ్యారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌ నివాసానికి వెళ్లిన వంశీ.. చాలా సేపు ఆయనతో సమా వేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రజాపాలన కార్యక్రమంతోపాటు పార్టీ సంస్థాగత వ్యవహా రాలపై చర్చ జరిగిందని గాంధీభవన్‌ వర్గాలు వెల్లడించాయి. గత 22 రోజుల ప్రభుత్వ పాల న తీరు, అధికారుల నియామకంలో పారదర్శ కత, ప్రజాపాలన నిర్వహణపై సీఎంకు వంశీ అభినందనలు తెలిపారని సమాచారం. 

కాంగ్రెస్‌ వర్గాల్లో ఊహాగానాలు..
నాగ్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్‌ వ్యవస్థాపక దినోత్సవ సభకు హాజరై వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం సచివాలయానికి రాలేదు. ఉదయం నుంచి జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఉన్న రేవంత్‌.. సీఎంవో అధికా రులతో భేటీ అయ్యారు. తనను కలిసేందుకు వచ్చిన కాంగ్రెస్‌ నాయకులతో సమావేశమ య్యారు. అయితే, ఏఐసీసీ పక్షాన వంశీచంద్‌రెడ్డి సీఎం రేవంత్‌ను కలవడం, అది కూడా చాలా సేపు ఈ భేటీ జరగడంతో కాంగ్రెస్‌ వర్గాల్లో ఊహా గానాలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇటీవల ఢిల్లీ పర్యటనలో రేవంత్, భట్టి విక్రమార్కలు పీసీసీ అధ్యక్ష ఎన్నికపై పార్టీ పెద్దలతో చర్చించారన్న వార్తల నేపథ్యంలో వంశీచంద్‌రెడ్డి తాజాగా రేవంత్‌ను కలవడం చర్చనీయాంశమవుతోంది. ఈ భేటీలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ అంశం చర్చకు వచ్చి ఉంటుందని, ఏఐసీసీ పక్షాన ఈ వ్యవహారానికి సంబంధించిన సమాచారం తీసుకుని వంశీ, రేవంత్‌ను కలసి ఉంటారనే చర్చ జరుగుతోంది. మరోవైపు పీసీసీ అధ్య క్షుడి ఎంపికపై కూడా ఇరువురు నేతలు చర్చించి ఉంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)