Breaking News

మంత్రికి తెలియకుండానే విజిలెన్స్‌ విచారణ?

Published on Fri, 07/24/2026 - 02:40

సాక్షి, హైదరాబాద్‌:  పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి తెలియకుండానే ఆ శాఖలో జరిగిన సన్న ధాన్యం టెండర్ల రద్దు వ్యవహారంపై విజిలెన్స్‌ విచారణ సాగడం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారం వెనుక సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నట్టుగా మంత్రి భావిస్తున్నారని తెలిసింది. మిగిలిపోయిన సన్న ధాన్యాన్ని గ్లోబల్‌ టెండర్ల ద్వారా విక్రయించాలని భావించి టెండర్లను పిలిస్తే, బిడ్డర్లు తక్కువ ధరను కోట్‌ చేయడంతో మంత్రి ఆదేశాలతో ఆ టెండర్లు రద్దయ్యాయి. అయితే రద్దయిన ఈ టెండర్లకు సంబంధించి మంత్రికి తెలియకుండా సీఎం రేవంత్‌రెడ్డి విజిలెన్స్‌ విచారణకు ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 

సంబంధిత శాఖ అధికారులు సైతం విషయం మంత్రికి తెలియజేయలేదని అంటున్నారు. విజిలెన్స్‌ విచారణ సంగతి పత్రికల్లో వచ్చేంత వరకు మంత్రికి కనీసం సమాచారం లేదని తెలుస్తోంది. దీనిపై తీవ్ర అసంతృప్తికి గురైన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. శాఖ ఉన్నతాధికారులపై తీవ్రంగా మండిపడినట్లు తెలిసింది. తనకు శాఖకు సంబంధించిన అంశాలు పత్రికల్లో చూసి తెలుసుకోవాల్సి వస్తోందంటూ సన్నిహితుల వద్ద ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. 

మంత్రిని సంప్రదించకుండానే..? 
గత ఖరీఫ్‌ సీజన్‌లో సేకరించిన ధాన్యంలో కేంద్రం సెంట్రల్‌ పూల్‌ కింద తీసుకున్నది, రాష్ట్ర అవసరాలకు ఉంచుకున్నది పోగా.. సుమారు 12 లక్షల టన్నుల సన్న ధాన్యం మిగిలిపోయింది. ఈ ధాన్యాన్ని గ్లోబల్‌ టెండర్ల ద్వారా వేలం వేయాలని నిర్ణయించిన మంత్రి.. పౌరసరఫరాల సంస్థ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. తొలుత 5 లక్షల టన్నుల ధాన్యాన్ని 11 లాట్లుగా విభజించి టెండర్లను ఆహా్వనించారు. ఇందులో కనీస ధరను టన్నుకు రూ. 34,050గా నిర్ణయించినప్పటికీ, బిడ్డర్లు రూ.25 వేల నుంచి రూ.27 వేల మధ్య మాత్రమే కోట్‌ చేశారు. దాంతో మంత్రి ఆదేశాల మేరకు ఆ టెండర్లను అధికారులు రద్దు చేశారు. 

ఈ నేపథ్యంలో బిడ్డర్లు తక్కువ ధరలకు ఎందుకు కోట్‌ చేశారనే అనుమానంతో ముఖ్యమంత్రి విజిలెన్స్‌ విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. అయితే ఈ నిర్ణయం తీసుకునే ముందు సంబంధిత శాఖ మంత్రి అయిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని సంప్రదించలేదని సమాచారం. కాగా  పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు కూడా మంత్రికి ఈ విషయం తెలియజేయకుండా ఏకంగా మిల్లుల్లో విచారణ చేపట్టారు. మీడియాలో వచ్చిన సమాచారంతో విషయం తెలుసుకున్న మంత్రి ఉత్తమ్‌..‘నా శాఖలో నాకు తెలియకుండా విజిలెన్స్‌ విచారణ ఎలా వేస్తారు..? ఎవరి ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు..?’ అంటూ  గురువారం అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. 

సీఎంవో నుంచే నిర్ణయాలా..? 
పౌరసరఫరాల శాఖకు సంబంధించిన కీలక నిర్ణయం నేరుగా సీఎంవో ఆదేశాలతోనే అమలవుతుండడం, ఆ శాఖ మంత్రికి సమాచారం ఇవ్వకపోవడం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎంవో నుంచి వచ్చిన సూచనల మేరకు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకు విజిలెన్స్‌ విచారణ, మిల్లుల్లో దాడులు చేపట్టినట్టు ప్రచారం జరుగుతోంది. కాగా ఆ మరుసటి రోజే మిల్లులకు ఇచ్చిన రూ.52 కోట్ల ధాన్యం మాయమైందనే విషయాన్ని కూడా మంత్రికి తెలియజేయకుండానే లీక్‌ చేసినట్లు తెలిసింది. 

మిల్లుల నుంచి సీఎంఆర్‌ పూర్తిగా సేకరించకుండానే ధాన్యం మాయమైందనే నిర్ణయానికి వచ్చిన అధికారులు.. ఆ విషయాన్ని లీక్‌ చేయడంపై కూడా మంత్రి ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. నిర్ణయాలు ముందుగా మీడియాకు లీక్‌ చేసి, అనంతరం శాఖను ఇరకాటంలో పెట్టేలా పరిస్థితి నెలకొంటోందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. విజిలెన్స్‌ విచారణ, దాడుల పేరుతో తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాన్ని కూడా ఆయన తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్లు సమాచారం. 

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)