Breaking News

డిసెంబరు 7న హైదరాబాద్ ఇంటర్నేషనల్ జాజ్ ఫెస్టివల్ 2024

Published on Fri, 12/06/2024 - 11:24

హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్ జనరల్, గోథే-జెంట్రమ్ హైదరాబాద్‌తో కలిసి హైదరాబాద్ ఇంటర్నేషనల్ జాజ్ ఫెస్టివల్ 2024 ప్రదర్శన  జరగనుంది.  ఈ ఫెస్టివల్  హైదరాబాద్‌లోని  పబ్లిక్‌ స్కూల్‌లో డిసెంబర్ 7, శనివారం సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు జరుగుతుందని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.  అమెరికా, ఇండియా, యూరప్  ఇంకా  ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాండ్‌లతో ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ ఫెస్టివల్‌కు  ప్రవేశం   ఉచితమని  కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.

యూఎస్‌ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ ది నేటివ్ జాజ్ క్వార్టెట్‌ను స్పాన్సర్ చేస్తోంది. వివిధ సంస్కృతులకు  చెందిన బ్యాండ్‌ సభ్యులు, ఇతర నిపుణులు పాల్గొంటారు. ముఖ్యంగా డ్రమ్మర్ ఎడ్ లిటిల్‌ఫీల్డ్ లింగిట్‌ తెగకు చెందిన అలస్కాన్  నేటివ్‌,  ఫిలిపినో-అమెరికన్ పియానిస్ట్ రీయుల్ లుబాగ్ ; జాజ్ ట్రంపెట్ కళాకారుడు నవజో సంతతికి చెందిన డెల్బర్ట్ ఆండర్సన్, వాషింగ్టన్‌లోని సియాటిల్‌కు చెందిన బాసిస్ట్ మైఖేల్ గ్లిన్ పాల్గొంటారు. ఇంకా ఈ ఉత్సవంలో జర్మనీ ,స్విట్జర్లాండ్ నుండి మాల్‌స్ట్రోమ్‌తో సహా ప్రదర్శనలు కూడా ఉంటాయి;   పోర్చ్‌గీస్‌ ఆర్టిస్ట్‌ కాచా ముండిన్హో, ఇద్దరు భారతీయ సంగీతకారులతో పాటు డచ్ కళాకారుడు స్జాహిన్ డ్యూరింగ్ నేతృత్వంలోని బ్యాండ్; హైదరాబాద్‌కు చెందిన జార్జ్ హల్ కలెక్టివ్ కళాకారులు తమ ప్రదర్శన ఇవ్వనున్నారు.

వరుసగా ఆరోసారి హైదరాబాద్ ఇంటర్నేషనల్ జాజ్ ఫెస్టివల్‌ను కోస్పాన్సర్ చేశామని హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్ జనరల్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ తెలిపారు. ఈ కచేరీకి U.S. ఆర్ట్స్ ఎన్వోయ్ ప్రోగ్రామ్  కూడా సపోర్ట్‌ చే​స్తోంది.  ఉత్తమ అమెరికా కళలను, సంస్కతిని  ప్రపంచంతో పంచుకోవడం, క్రాస్-కల్చరల్ అవగాహన , సహకారాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. అమెరికన్ ఆర్ట్స్ నిపుణులతో ఇంటరాక్ట్ కావాలనుకునే   ఔత్సాహికులకు ఇదొక గొప్ప అవకాశమని నిర్వాహకులు తెలిపారు.
 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)