Breaking News

ముగ్గులు వేసి.. మురిసిపోయి

Published on Sun, 01/15/2023 - 00:39

బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌): ప్రముఖ నృత్యకారిణి, తెలంగాణ సంగీత, నాటక అకాడమీ చైర్‌పర్సన్‌ దీపికారెడ్డి నివాసంలో శనివారం సంక్రాంతి సంబురాలు అంబరాన్ని అంటాయి. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.72లోని దీపికారెడ్డి నివాసంలో జరిగిన ఈ వేడుకలకు హైదరాబాద్‌లో యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌ హాజరై సందడి చేశారు. దీపికారెడ్డి ఆమెకు సంప్రదాయబద్ధంగా తిలకందిద్ది ఇంట్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జెన్నిఫర్‌ రంగవల్లులు వేసి మురిసి పోయారు.

సంక్రాంతి ప్రత్యేక వంటకాలైన అరిసెలు, సకినాలు, పొంగల్‌ రుచిచూసి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం దీపికారెడ్డి శిష్యబృందం సంక్రాంతి నేపథ్యంగా నిర్వహించిన నృత్యరూపకాన్ని ఆమె తిలకించారు. సంక్రాంతి పర్వదినాన్ని ఎలా జరుపుకుంటారో తెలియజేస్తూ.. ముగ్గులు, భోగి మంటలు, భోగి పండ్లు, సంక్రాంతి, కనుమ విశిష్టతలపై ఈ నృత్యరూపకం కొనసాగింది. 3 గంటలపాటు జెన్నిఫర్‌ ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

అనంతరం శాస్త్రీయ నృత్య ముద్ర లను అభినయించారు. సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందని జెన్నిఫర్‌ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. మన పండుగలను తెలుసుకునేందుకు ఆమె చూపిన ఉత్సా హం మరువలేనిదని ఈ సందర్భంగా దీపికారెడ్డి వెల్లడించారు. తమ ఇంట్లోకి వచ్చేక్రమంలో చెప్పులను బయట విడిచి రావడమే కాకుండా బొట్టు పెడుతుండగా దానిని ఆనందంతో ఆస్వాదించి పండుగలో నిమగ్నమైన తీరు ఆకట్టుకుందని ఈ సందర్భంగా దీపికారెడ్డి తెలిపారు.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)