Breaking News

10 నిమిషాల్లోనే.. భార్య శరీర భాగాలను నరికిన భర్త

Published on Wed, 08/27/2025 - 09:07

సాక్షి,  హైదరాబాద్‌: కోడిని కోసినంత సులువుగా.. పదే పది నిమిషాల్లో భార్య మృతదేహాన్ని నాలుగు ముక్కలుగా నరికానని విచారణలో నిందితుడు మహేందర్‌ రెడ్డి పోలీసులకు తెలిపినట్లు తెలిసింది. కాళ్లు, చేతులు, తల, మొండం వేర్వేరుగా చేసి.. మొండం మినహా మిగిలిన శరీర భాగాలను పర్వతాపూర్‌ వంతెన పైనుంచి మూసీలో పడేసినట్లు వివరించాడు. మేడిపల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో గర్భిణి అయిన భార్య స్వాతిని భర్త మహేందర్‌రెడ్డి హత్య చేసిన సంగతి తెలిసిందే. హత్య జరిగి మూడు రోజులు గడుస్తున్నా ఇప్పటికీ హతురాలి శరీర భాగాలు లభించలేదు. 

మూసీలోకి వరద ఉధృతి ఎక్కువగా ఉండటంలో శరీర భాగాలు వరదలో కొట్టుకుపోవచ్చని, మూసీ వంతెన నుంచి 10 కి.మీ. దిగువన పోలీసులు, డీఆర్‌ఎఫ్‌ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఇప్పటికే బాలాజీనగర్‌లోని నిందితుడి ఇంటి నుంచి శరీర భాగాలను పారేసిన ప్రతాప సింగారం మూసీ వంతెన వరకూ ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌లను పోలీసులు సేకరించారు. అలాగే హతురాలి మొండం నుంచి డీఎన్‌ఏ నమూనాలను సేకరించి, ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీకి పంపించారు. కోర్టు అనుమతితో హతురాలిని, ఆమె తల్లిదండ్రుల డీఎన్‌ఏ పరీక్షలను నిర్వహించారు. నిందితుడు మహేందర్‌ రెడ్డిని కస్టడీకి కోరుతూ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. 

ఆత్మహత్య చేసుకోవాలని ఒత్తిడి.. 
నిందితుడు మహేందర్‌ రెడ్డి గతంలో స్వాతిని పలుమార్లు ఆత్మహత్య చేసుకోవాలని ఒత్తిడి చేశాడని, భర్తతో ఎదుర్కొన్న వేధింపులు తనతో చెప్పుకొని ఏడ్చిందని స్వాతి చెల్లెలు శ్వేత కన్నీరుమున్నీరైంది. స్వాతిని శారీరకంగా, మానసికంగా హింసించేవాడని ఆరోపించింది. వికారాబాద్‌ జిల్లా కామారెడ్డిగూడ సమీపంలోని ఒక వరద కాల్వ వద్దకు తీసుకెళ్లి అందులో దూకాలని ఒత్తిడి చేశాడని, చిన్న విషయానికే ఉద్దేశపూర్వకంగానే తగాదా పెట్టుకునేవాడని, ఈ క్రమంలో ఒకరోజు తాడు ఇచ్చి ఉరేసుకోవాలని ఒత్తిడి చేశాడని 
ఆమె వాపోయింది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)