Breaking News

పదేళ్లు పూర్తయిన వారందరికీ ఆధార్‌ నవీనీకరణ తప్పని సరి

Published on Mon, 08/14/2023 - 13:50

సాక్షి,మేడ్చల్‌ జిల్లా:  ఆధార్‌ కార్డు నవీకరణ గడువును కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలల పాటు పొడిగించింది. కార్డులు పొంది పదేళ్లు పూర్తయిన వారు, ప్రస్తుతం ఉన్న కార్డులను నవీనీకరించుకోవాలని ఇప్పటికే యూఐడీఏఐ సూచించింది. ఆధార్‌ కార్డు నవీనీకరణకు మొదట జూన్‌ 14 వరకు గడువు విధించారు. అయితే ప్రజల నుంచి నామ మాత్రంగా స్పందన రావడంతో గడువును మరో మూడు నెలల పాటు పొడిగించారు.  2010–18 సంవత్సరాల మధ్య ఆధార్‌ కార్డులు పొందినవారు సెపె్టంబరు 14 వరకు ఉచితంగా నవీనీకరించుకోవచ్చని ప్రభుత్వం సూచించింది. 

రెండు రకాలుగా... 
ఆధార్‌ కార్డును మై–ఆధార్‌ పోర్టల్, ఎం–ఆధార్‌ యాప్‌లో ఉచితంగా నవీనీకరించుకోవచ్చు. ప్రభుత్వ కార్యాలయాల్లో కొనసాగుతున్న శాశ్వత ఆధార్‌ కేంద్రాల్లోనూ మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. ఆధార్‌ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు గతంలో ప్రజలు చెప్పిన వ్యక్తిగత వివరాలను మాత్రమే హడావుడిగా నమోదు చేశారు. చాలా మంది తప్పుడు సమాచారం ఇచి్చనట్లు గుర్తించారు. ప్రస్తుతం,.. గతంలో ప్రజలు వెల్లడించిన వివరాల ప్రకారం ధ్రువపత్రాలను అప్‌లోడ్‌ చేసి నవీనీకరించుకోవచ్చు. నవీనీకరణకు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పత్రాన్ని ఖచి్చతంగా సమరి్పంచాల్సి ఉంటుంది. అక్షరాస్యులైతే పదో తరగతి మార్కుల మెమోను తీసుకెళ్తే సరిపోతుంది. ఓటరు గుర్తింపు కార్డు, రేషన్‌ కార్డు, ఉపాధిహామీ జాబ్‌ కార్డు, బ్యాంకు పాస్‌ పుస్తకం, పాస్‌ పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్స్, వివాహ పత్రం, తహసీల్దార్‌ జారీ చేసిన ధ్రువపత్రాలను తీసుకెళ్లి ఆధార్‌ కార్డు నవీనీకరణను పూర్తి చేసుకోవచ్చు. 

ఇతర మార్పులకు ఇలా... 
ప్రస్తుతం పదేళ్లు దాటిన వారందరూ ఆధార్‌ కార్డు సమాచారాన్ని నవీనీకరించుకోవాల్సి ఉంది. దీంతోపాటు పేరులో అక్షరాలను సరి చేసుకోవడానికి, ఫొటో, చిరునామా మార్పు, ఫోన్‌ నంబర్లలో మార్పులు చేసుకోవచ్చును. జిల్లాలోని చాలా గ్రామాల్లో ప్రస్తుతం ఆధార్‌ నమోదు కేంద్రాలు అందుబాటులో లేవు. నవీనీకరణకు తప్పనిసరిగా మండల కేంద్రాలకు వెళ్లాల్సి ఉండటంతో చాలా మంది ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. గతంలో కొత్తగా ఆధార్‌ కార్డుల జారీ సమయంలో గ్రామాల వారీగా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ నవీనీకరణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)