Breaking News

త్వరలో కృష్ణా ట్రిబ్యునల్‌–2 అమల్లోకి..?

Published on Fri, 05/02/2025 - 03:58

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా జలాల పంపిణీపై జస్టిస్‌ బ్రిజేశ్‌కుమార్‌ నేతృత్వంలో కృష్ణా ట్రిబ్యునల్‌–2 జారీ చేసిన తీర్పును అమల్లోకి తీసుకురావడంలో భాగంగా గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విషయంలో అభిప్రాయ సేకరణ కోసం ఈ నెల 7న కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సీఆర్‌.పాటిల్‌ సంబంధిత రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులతో సమావేశం కానున్నారు. కృష్ణా జలాల పంపిణీపై 2013 నవంబరు 29న కృష్ణా ట్రిబ్యునల్‌–2 తీర్పు వెలువరించింది. తీర్పును అమల్లోకి తెస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయరాదని కోరుతూ నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ సైతం ఈ కేసులో ఇంప్లీడ్‌ అయ్యింది. సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి ఉన్న వాటాను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పంపిణీ చేసే బాధ్యతలను కృష్ణా ట్రిబ్యునల్‌–2కే కేంద్రం అప్పగించింది. దీనిపై ట్రిబ్యునల్‌లో విచారణ జరుగుతోంది. ఉమ్మడి ఏపీకి కేటాయించిన 1,005 టీఎంసీలను తెలుగు రాష్ట్రాలకు పంచడానికి మాత్రమే విచారణ జరుగుతున్న ట్రిబ్యునల్‌ తీర్పును అమల్లోకి తెస్తూ గెజిట్‌ ప్రకటన జారీ చేయాలని మహారాష్ట్ర, కర్ణాటక కోరుతున్నాయి. 

ఈ నేపథ్యంలో కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులతో ఈనెల 7న న్యూఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సమావేశమై ఈ అంశంపై చర్చించనున్నారు. ఈ భేటీలో రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే గెజిట్‌ ప్రకటన జారీ చేసే అవకాశముంది. దీంతో కృష్ణా ట్రిబ్యునల్‌–2 తీర్పు అమల్లోకి రానుంది. ప్రధానంగా ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును 519 అడుగుల నుంచి 524 అడుగులకు పెంచడం, ఇతర బేసిన్లో ఉన్న కోయిన ప్రాజెక్టుకు 92 టీఎంసీల నీటిని కేటాయించడంపై ఉమ్మడి ఏపీ అభ్యంతరం తెలిపింది.  

ఇంకా కృష్ణా ట్రిబ్యునల్‌–1 కేటాయింపులే.. 
కృష్ణా ట్రిబ్యునల్‌–1 (బచావత్‌ ట్రిబ్యునల్‌) కృష్ణాలో 2,060 టీఎంసీల లభ్యత ఉందని నిర్ధారించి మహారాష్ట్రకు 560, కర్ణాటకకు 700, ఉమ్మడి ఏపీకి 800 టీఎంసీల కేటాయింపులు జరిపింది. దీనికి అదనంగా రీజనరేట్‌ అయిన 11 టీఎంసీలను కూడా జోడించింది. కృష్ణా ట్రిబ్యునల్‌–2 తీర్పు అమల్లోకి రాకపోవడంతో 1976లో అమల్లోకి వచ్చిన కృష్ణా ట్రిబ్యునల్‌–1 కేటాయింపులే ఇంకా అమలవుతున్నాయి. వందేళ్లలో కచ్చితంగా 75 ఏళ్ల పాటు వచ్చే వరద (75 శాతం లభ్యత) ఆధారంగా 2,060 టీఎంసీల నీటిలభ్యత కృష్ణాలో ఉందని కృష్ణా ట్రిబ్యునల్‌–1 తేల్చింది. 

65 శాతం లభ్యత ఆధారంగా కృష్ణాలో 2,578 టీఎంసీల లభ్యత ఉందని కృష్ణా ట్రిబ్యునల్‌–2 నిర్ధారించి ఉమ్మడి ఏపీకి 1,005, కర్ణాటకకు 907, మహారాష్ట్రకు 666 టీఎంసీల కేటాయింపులు చేసింది. 65 శాతం లభ్యతతో నీటి కేటాయింపులు చేస్తే దిగువ రాష్ట్రాలు నష్టపోతాయని ఉమ్మడి ఏపీ అభ్యంతరం తెలిపింది. ఈ నేపథ్యంలో 7న జరగబోయే సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరితేనే కృష్ణా ట్రిబ్యునల్‌–2ను అమల్లోకి తెస్తూ గెజిట్‌ ప్రకటన వస్తుంది.  

Videos

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)