Breaking News

‘మిస్‌ అయిన వారి కోసం త్వరితగతిన చర్యలు చేపట్టండి’

Published on Tue, 07/01/2025 - 17:25

పాశమైలారం(సంగారెడ్డి జిల్లా): పాశమైలారం సిగాచి పరిశ్రమలో రియాక్టర్‌ పేలి పలువురు మృత్యువాత పడటంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఇది చాలా దురుదృష్టకర సంఘటన అని, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు.  పాశమైలారం సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లిన ఆయన మాట్లాడుతూ..  ‘ సిగాచి పరిశ్రమ ఫార్మా కంపెనీలకు మెటీరియల్‌ సప్లై చేస్తుంది. ఇప్పటివరకూ 42 మృతదేహాలు లభించాయి. ఇంకా కొంతమంది ఆచూకీ కనిపించడం లేదు. 

గతంలో కూడా ఓ పరిశ్రమంలో షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల 11 మంది చనిపోయారు. అధికారులతో ఒక బృందం ఏర్పాటు చేయాలి.జ  పరిశ్రమల్లో తనిఖీలు లంచాల కోసం జరుగుతున్నాయా?,  నామ్‌ కి వాస్తు ప్రకారం జరుగుతున్నాయా? అని ప్రభుత్వం ఆలోచించాలి.  ప్రమాద బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. పొట్ట కూటి కోసం వచ్చి ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. ఇంతమంది చనిపోవడం బాధాకరం. 

సిగాచి వారికి మరో 3 పరిశ్రమలు ఉన్నాయి. ఇప్పటికైనా అన్నింటినీ తనిఖీ చేయాలి. మృతుల జాబితా వచ్చిన తర్వాత ఆయా రాష్ట్రాల వారికి మా పార్టీ అండగా ఉంటుంది. మిస్‌ అయిన వారి ఆచూకీని ప్రభుత్వం త్వరగా తెలుసుకోవాలి. పరిశ్రమల ప్రాంతంలో కచ్చితంగా అంబులెన్స్‌ ఉండే విధానం చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహకరిస్తాం.  శిథిలాల కింద మృతదేహాల కోసం పోలీస్‌ డాగ్స్‌ను కూడా ఉపయోగించాలి. చనిపోయిన కుటుంబాల సభ్యులు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోతామంటే సహకరిస్తాం. ఇది రాజకీయాలు చేసే సమయం కాదు’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Videos

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

ACల దొంగలు.. వైరల్ అవుతున్న వీడియో

ధురంధర్ డైరెక్టర్ తో టాక్సిక్ హీరో.. పాన్ ఇండియా షేక్ చేసే కాంబో?

శ్రీ చరణి దెబ్బ అదుర్స్! 55 పరుగులకే పాక్ ఆలౌట్..

టీచర్ ఉద్యోగం కోసం 12 లక్షలు అడిగారు.. లోకేష్ మనుషులు వచ్చి మాట్లాడుతారు అంటూ..

SBI గుడ్ న్యూస్.. రూ.15 లక్షల స్కాలర్ షిప్!

10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!

DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

పుట్టలో పాముల్లా బయటికొస్తున్న DSC అక్రమాలు

జూడో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం

Photos

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)