Breaking News

భూగర్భ విద్యుత్‌ లైన్లు ఎప్పుడో?

Published on Tue, 08/19/2025 - 10:01

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహా నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా ప్రధాన రహదారులు, వీధుల్లో వేలాడుతున్న ఓవర్‌హెడ్‌ విద్యుత్‌ లైన్లను తొలగించి, వాటి స్థానంలో భూగర్భ విద్యుత్‌ లైన్లు ఏర్పాటు చేయాలని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ నిర్ణయించింది. ఆ మేరకు సెక్షన్ల వారీగా ఫీడర్ల వివరాలను సేకరించింది. 

ఒక్కో సెక్షన్‌కు రూ.వంద కోట్ల చొప్పున గ్రేటర్‌ వ్యాప్తంగా ఇందుకు రూ.15 వేల కోట్లకుపైగా అవసరం ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేసింది. మెట్రోజోన్‌ పరిధిలోని హైదరాబాద్‌ సెంట్రల్, బంజారాహిల్స్, సికింద్రాబాద్‌ సర్కిళ్లలో డిస్ట్రిబ్యూషన్‌ లైన్లు మినహా 33/11 కేవీ లైన్ల పనులు దాదాపు పూర్తి అయ్యాయి. ఇక మేడ్చల్‌ (హబ్సిగూడ, మేడ్చల్‌ సర్కిల్‌), రంగారెడ్డి (సైబర్‌సిటీ, రాజేంద్రనగర్, సరూర్‌నగర్‌) జోన్ల పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇప్పటికీ ఓహెచ్‌ (ఓవర్‌ హెడ్‌ లైన్లే) కన్పిస్తున్నాయి.

 ఈదురు గాలులతో కూడిన వర్షానికి తరచూ తెగిపడుతూ..అటుగా వచ్చి వెళ్లేవారిపై పడి అమాయక ప్రజల మృత్యువాతకు కారణమవుతున్నాయి. ప్రమాదాలను నియంత్రించడంతో పాటు వేలాడే కరెంట్‌ తీగలు కని్పంచని నగరంగా తీర్చిదిద్దాలని భావించి..ఆ మేరకు నగరమంతా భూగర్భ విద్యుత్‌ లైన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇటీవలే ఉపముఖ్య మంత్రి భట్టి నేతృత్వంలోని ఇంజనీర్ల బృందం బెంగళూరులో పర్యటించి, ఆ మేరకు భూగర్భ విద్యుత్‌ కేబుల్‌ పనులను పరిశీలించింది. సెక్షన్ల వారీగా ప్రతి పాదనలు సిద్ధం చేయాల్పిందిగా ఆదేశాలు జారీ చేయడంతో ప్రాజెక్ట్‌ విభాగం సమగ్ర నివేదికను సిద్ధం చేసింది.    

ప్రతిపాదన దశలోనే ఆ పనులు.. 
గ్రేటర్‌లో ప్రస్తుతం 63 లక్షలకుపైగా విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా, వీటిలో 52 లక్షలకుపైగా గృహ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం రోజు గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ 65 మిలియన్‌ యూనిట్లకు చేరుకుంది. పాతబస్తీ సహా ప్రధాన బస్తీల్లో ఇప్పటికీ నిజాం కాలం నాటి ఓవర్‌హెడ్‌ లైన్లు, ఇనుప స్తంభాలే దర్శనమిస్తున్నాయి. ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ లైన్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. చిన్నపాటి ఈదురుగాలితో కూడిన వర్షానికే తెగిపడుతున్నాయి. విద్యుత్‌ అంతరాయాలకే కాకుండా అనేక మంది మృత్యువాతకు కారణమవుతున్నాయి. లైన్ల కింద అనేక చోట్ల భారీ భవంతులు వెలిశాయి. 

ఇంటిపై దుస్తులను ఆరవేసేందుకు వెళ్లిన మహిళలు, పతంగులను ఎగరేసేందుకు వెళ్లిన పిల్లలు ఓవర్‌ హెడ్‌ లైన్‌కు ఆనుకుని విద్యుత్‌ షాక్‌తో మృతి చెందుతున్న విషయం తెలిసిందే. ఓవర్‌హెడ్‌లైన్ల స్థానంలో యూజీ కేబుళ్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలను నివారించడంతో పాటు సరఫరా వ్యవస్థను మరింత మెరుగుపర్చొచ్చని డిస్కం భావించినప్పటికీ..ఇందుకు సంస్థ వద్ద సరిపడు నిధులు లేకపోవడం పనులకు విఘాతంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఏదైనా స్కీం ప్రకటించి నిధులు కేటాయిస్తే మినహా..ఇప్పట్లో ఈ పనులు మొదలయ్యే పరిస్థితి లేదు.  

 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)