Breaking News

కోరినన్ని వర్షాలు కురుస్తాయి..

Published on Tue, 07/23/2024 - 04:58

రాంగోపాల్‌పేట్‌(హైదరాబాద్‌): సికింద్రా బాద్‌ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలు సోమవారంతో అంగరంగ వైభవంగా ముగిశాయి. ఉత్స వాల్లో రెండో ఘట్టమైన రంగం కార్యక్రమంలో భాగంగా ఉదయం 9.55 గంటల సమ యంలో అమ్మవారి గర్భగుడికి ఎదురుగా ఉండే మాతంగేశ్వరి గుడి ముందు పచ్చికుండపై నిలబడి స్వర్ణలత భవిష్య వాణి వినిపించారు. ‘ఈ ఏడాది భక్తులు సమర్పించిన బోనాలు, సాక, పూజలు నాకు ఆనందాన్ని చ్చాయి. కోరినన్ని వర్షాలు కురుస్తాయి. నా ప్రజలందరినీ బాగా చూసుకుంటా, నన్ను నమ్ముకున్న వారిని నేను కాపా డుకుంటా. 

నా రూపాన్ని పెట్టాలనే సంకల్పాన్ని నెర వేర్చుకుంటా. నాకు శాశ్వత రూపం పెట్టా లని చూస్తున్నారు అది చేయండి, నాకు రక్తబలిని ఇవ్వడం లేదు. మీకు నచ్చింది ఇస్తున్నారు. దాంతోనే నేను సంతోషంగా ఉన్నాను. అదే చాలు. 5 వారాలపాటు పప్పు, బెల్లంతో సాక పెట్టండి. పంటల్లో ఎక్కువ రసాయనాలు వాడుతున్నారు, వాటితో రోగాలు పెరిగిపోతున్నాయి, వాటి ని తగ్గించుకోండి. పిల్లలు, గర్భిణీలకు ఏ ఇబ్బంది రానివ్వను. అంద రినీ సంతోషంగా ఉండేలా చూసుకుంటా ను’అని అన్నా రు. 

ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ ముఖ్య కార్య దర్శి శైలజా రామయ్యర్, కమి షనర్‌ హన్మంతరావు, కలెక్టర్‌ అనుదీప్‌ దురి శెట్టి, ఈవో మనోహర్‌రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.

ఘనంగా అమ్మవారికి సాగనంపు..: బోనా లు, రంగం అనంతరం అమ్మవారి సాగనంపు కార్యక్రమాన్ని ఘనంగా చేప ట్టారు. అమ్మవారిని అంబారీపై ఉంచి, అమ్మవారి ఘటంతో సాగనంపు కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనితో జాతర ముగిసింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)