విద్య.. కేంద్ర గుత్తాధిపత్యం కాదు

Published on Fri, 02/21/2025 - 05:18

సాక్షి, హైదరాబాద్‌: భారత రాజ్యాంగంలో విద్య ఉమ్మడి జాబితాలో ఉందని, దానిపై కేంద్ర ప్రభుత్వ గుత్తాధిపత్యం పనికిరాదని డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. విద్యపై కేంద్రానికి గుత్తాధిపత్యం కట్టబెట్టేందుకే యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చిందని ఆరోపించారు. రాష్ట్రాలు తమ సొంత విద్యావిధానాన్ని రూపొందించుకోవడానికి అధికారం ఉండాలని అభిప్రాయపడ్డారు. విద్యా వ్యవస్థను ఢిల్లీ నుంచి రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా నడపలేరని తేల్చి చెప్పారు. కేరళ ప్రభుత్వం తిరువనంతపురంలో గురువారం నిర్వహించిన జాతీయ ఉన్నత విద్యా సమ్మేళనంలో భట్టి మాట్లాడారు. ‘యూజీసీ నిబంధనలు మీరు బిల్లు చెల్లించాలి కానీ ఫుడ్‌ ఆర్డర్‌ చేయలేరు అన్నట్లుగా ఉన్నాయి.

వర్సిటీలకు రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూర్చాలి. కీలకమైన వైస్‌–చాన్స్‌లర్ల నియామకం, ప్రవేశాలపై అధికారం మాత్రం కేంద్రానికి ఇవ్వాలని ముసాయిదాలో ఉంది. వైస్‌ చాన్స్‌లర్ల నియామకానికి సెర్చ్‌ కమిటీల్లో రాష్ట్ర ప్రభుత్వ పాత్రను తొలగించడం, వైస్‌ చాన్స్‌లర్ల అర్హతలు మార్చడం ఆందోళనకరం. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రాలు భవనాలు ప్రారంభించే రిబ్బన్‌ కటింగ్‌ అధికారానికి మాత్రమే పరిమితమవుతాయి’ అని పేర్కొన్నారు. 

రాష్ట్రాలకు విద్యపై స్వయంప్రతిపత్తి ఉండాలి: స్వయం ప్రతిపత్తి లేకుండా నాణ్యమైన విద్యను ఏ రాష్ట్రమూ అందించలేదని భట్టి విక్రమార్క అన్నారు. ఈ అంశంపై రాష్ట్రాల ఉమ్మడి విజ్ఞప్తిని కేంద్రం తప్పక పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సహకారమంటే బలవంతంగా రుద్దడం కాదని చురకలంటించారు. రాష్ట్రాలు ఐక్యంగా గళం విప్పితే ఆ ప్రతిధ్వని ఎంత దూరమైనా చేరుతుందని అన్నారు. తెలంగాణలో విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలు, ఫలితాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా భట్టి వివరించారు.

సరైన మార్గాన్ని ఎంచుకునే హక్కు రాష్ట్రాలకు ఉందని, సరైన నిర్ణయం తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ అంశంపై తదుపరి సమావేశాన్ని తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో నిర్వహించేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కేరళ సీఎం పినరయి విజయన్, ఆ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్‌. బిందు, కర్ణాటక మంత్రి ఎం.సీ. సుధాకర్‌ అవారే, తమిళనాడు నుంచి తిరు గోవి చేజియాన్, పంజాబ్‌ నుంచి సర్దార్‌ హరోజ్‌ సింగ్‌ తోపాటు ప్రముఖ విద్యావేత్తలు పాల్గొన్నారు.  

Videos

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య కుట్ర

అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే

ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్

ఒక రోజుకు 80 లక్షలు... ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నారు..!

చైనా వేదికపై ఫేక్ మేయర్ ప్రచారం?

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)