Breaking News

తెలంగాణకు కింగ్‌ఫిషర్‌ బీర్లు బంద్‌

Published on Wed, 01/08/2025 - 15:58

సాక్షి, హైదరాబాద్‌: పండుగ ముందర మద్యం ప్రియులకు చేదు వార్త.  తెలంగాణ బెవరేజస్‌ కార్పొరేషన్‌(TSBCL)కు బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు యునైటెడ్‌ బ్రూవరీస్‌ లిమిటెడ్‌(యూబీ)ప్రకటించింది. దీంతో ఆ సంస్థ నుంచి రాష్ట్రానికి వచ్చే కింగ్‌ఫిషర్‌(King Fisher), హెనికిన్‌ బీర్ల సరఫరా ఆగిపోనుంది. 

తెలంగాణ బెవరేజస్‌ కార్పొరేషన్‌ నుంచి తమకు రూ.900 కోట్లు బకాయి ఉందని, పైగా 2019 నుంచి ధరలను సవరించకపోవడంతోనే యూబీ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు సెబీకి లేఖ ద్వారా తెలిపింది.

కాగా, రాష్ట్రంలో ఎక్కువగా అమ్ముడయే బీర్‌ బ్రాండ్‌ కింగ్‌షిషరే. తెలంగాణ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ యూబీ సంస్థకు ప్రతి 45 రోజులకోసారి బకాయిలు చెల్లించాల్సి ఉండగా, నాలుగు నెలలుగా బకాయిలు చెల్లించకపోవడంతో సరఫరా నిలిపివేసినట్లు సమాచారం.

తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లపై 35 శాతం రేట్లు పెంచాలని బేవరేజ్ కార్పొరేషన్‌ను యునైటెడ్ బ్రూవరీస్‌ కోరింది. యునైటెడ్ బేవరేజస్‌ ప్రతిపాదనలపై గతంలోనే కమిటీని ప్రభుత్వం నియమించింది. రిటైర్డ్ జడ్జిలతో వేసిన కమిటీ నివేదిక కోసం ప్రభుత్వం వేచి చూస్తోంది. యునైటెడ్‌ బేవరేజస్ ప్రతిపాదనలతో మందు బాబులపై ఆర్థిక భారం పెరగనుంది. మద్యం ప్రియులపై భారం పడకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

తెలంగాణ బేవరేజస్ కార్పొరేషన్కు బీర్ల సప్లై నిలిపివేత

ఇదీ చదవండి: ఫ్యూచర్‌ సిటీ.. పోలీసుల పోటీ!

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)