Breaking News

Ameerpet: అరిష్టాలు తొలగిపోతాయని ఆలయంలో చోరీ

Published on Wed, 03/12/2025 - 11:29

హైదరాబాద్‌: అరిష్టాలు తొలగిపోతాయని గుడిలో పంచలోహ విగ్రహాలు దొంగిలించిన ఇద్దరు మహిళలను ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దొంగతనం చేసిన 48 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ వెంకటరమణ, ఇన్స్‌పెక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. ఎస్‌ఆర్‌నగర్‌ సమీపంలోని గురుమూర్తినగర్‌లో శ్రీ వినాయక ఆలయం గర్భగుడిలో శివపార్వతుల పంచలోహ విగ్రహాలు కనిపించడం లేదంటూ ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించారు. శనివారం భక్తుల రూపంలో వచ్చిన మహిళలు తమ మాయమాటలతో అర్చకుడిని బోల్తా కొట్టించి విగ్రహాలు ఎత్తుకుళ్లినట్లు గుర్తించారు. బంజారాహిల్స్‌ ఎన్‌బీటీనగర్‌కు చెందిన స్వర్ణలత, పావని అనే మహిళలు ఆలయానికి వచ్చిన..అర్చకుడు నవీన్‌కుమార్‌ తీర్థ ప్రసాదాలు పంచి పెడుతుండగా అదును చూసి విగ్రహాలను ఓ సంచిలో వేసుకుని పారిపోయారు. కొద్దిసేపటి తర్వాత అర్చకుడిని విగ్రహాలు కనిపించక పోవడంతో అధికారులకు సమాచారం అందించారు.

 గడిచిన రెండేళ్ల కాలంలో స్వర్ణలతో ఇంట్లో వరుసగా నలుగురు మరణించారు. తల్లిదండ్రులతో పాటు ఇద్దరు సోదరులు చనిపోవడంతో అరిష్టం వల్లే మృతి చెందారని భావించింది. నిత్యం పూజలందుకునే మహిమాని్వతులైన దేవుళ్ల విగ్రహాలను ఇంట్లో పెట్టుకుంటే మంచి జరుగుతుందని, సకల శుభాలు జరుగుతాయని నమ్మింది. పావనికి విషయాన్ని చెప్పి పథకం ప్రకారం ఇద్దరు విగ్రహాలను దొంగిలించినట్లు విచారణలో అంగీకరించారు. వారిద్దరికి ఎలాంటి నేర చరిత్ర లేదని పోలీసులు తెలిపారు. 
విగ్రహాలను స్వా«దీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

 

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)