హాస్టల్‌కు వెళ్లడం ఇష్టంలేక...

Published on Sat, 02/01/2025 - 12:10

దామెర/వర్ధన్నపేట: హాస్టల్‌కు వెళ్లడం ఇష్టంలేక ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం రాంధన్‌తండాకు చెందిన గుగులోతు నందిని (13) టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఎస్‌ పర్వతగిరి గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. సంక్రాంతి సెలవులకు ఇంటికొచి్చంది. 

సెలవులు ముగిసినా స్కూల్‌కు వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన నందిని గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లిపోయింది. తల్లిదండ్రులు ఆందోళన చెంది గ్రామమంతా వెతుకుతున్న సమయంలో వ్యవసాయ బావి వద్ద కనిపించిందని తెలియడంతో బావిలో ఎంత వెదికినా లభించలేదు. తిరిగి శుక్రవారం ఉదయం బావిలో మరోసారి వెతకగా నందిని మృతదే హం దొరికింది. కేసు న మోదు చేసుకుని దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్సై చందర్‌ తెలిపారు.

 కాగా, హనుమకొండ జిల్లా దామెర మండలంలోని పసరగొండకు చెందిన గజ్జి పాల్‌ (16) ములుగు సమీపంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఇటీవల హాస్టల్‌ నుంచి ఇంటికి వచి్చన బాలుడు తిరిగి వెళ్లేందుకు నిరాకరించాడు. దీంతో తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురై గురువారం  సమీపంలోని బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం బాలుడి తండ్రి రమేశ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై కొంక అశోక్‌ తెలిపారు.  

 

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)