Breaking News

స్వీట్‌ క్రాకర్స్‌.. మతాబుల రూపాల్లో చాక్లెట్ల తయారీ

Published on Fri, 10/25/2024 - 07:45

ఈ ఫొటోలో ఉన్నవి ఏంటో చెప్పండి చూద్దాం.. చాలా కాన్ఫిడెంట్‌గా టపాసులు అనుకుంటున్నారు కదా! అయితే మీరు..తప్పులో కాలేసినట్లే..! అవి టపాసుల్లాంటి టపాసులు..కానీ టపాసులు కాదు.. ఎందుకంటే ఈ పటాసులతో పర్యావరణానికి ఎలాంటి హానీ ఉండదు.. పొగ రాదు. నిప్పు రవ్వలు అసలే ఎగసి పడవు. మరి అవన్నీ రాకపోతే అవి పటాసులు ఎందుకు అవుతాయి? అని ఆశ్చర్యపోతున్నారా.. అవును అక్కడికే వస్తున్నాం.. మీకొచ్చిన డౌటనుమానం కరెక్టే. ఎందుకంటే అవి నిజమైన టపాసులు  కావు. అవి చాక్లెట్స్‌.. అరరే.. చూస్తే టపాసుల్లా భలే ముద్దుగా ఉన్నాయే అనుకుంటున్నారా..? స్వీట్స్‌ను టపాసుల్లాగా చేయాలన్న ఆలోచనతో ఇలా వినూత్నంగా ఇద్దరు అక్కాచెల్లెళ్లు వీటిని తయారు చేస్తున్నారు. 

దీపావళి సంబరాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. స్వీట్లు, టపాసులతో దుకాణాలు కళకళలాడుతున్నాయి. స్నేహితులు, బంధువులకు స్వీట్లు పంచుకుంటూ దీపావళి శుభాకాంక్షలు చెప్పుకొంటుంటారు. టపాసులు పేలుస్తూ సంబరాలు చేసుకుంటారు. అయితే ఈ రెండింటినీ మిళితం చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేశారు గజ్జల హరితారెడ్డి, లిఖితారెడ్డి. ఇద్దరు అక్కా చెల్లెళ్లూ అనుకున్నదే తడవుగా ఇలా టపాసులను తయారు చేశారు. అదేనండీ టపాసుల్లాంటి చాక్లెట్లు.

కాస్త భిన్నంగా ఉండాలని..  
ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధం అవుతున్న వీరిద్దరూ ప్రిపరేషన్‌ సమయంలో వచ్చే ఒత్తిడిని తట్టుకునేందుకు ఇలా ఇంట్లోనే చాక్లెట్లు తయారుచేయడం అలవాటుగా మార్చుకున్నారు. అలా అలా.. వీరు చేస్తున్న చాక్లెట్లు, కుకీలకు మంచి ప్రశంసలు వస్తుండటంతో డీమెల్ట్‌ పేరుతో చిన్నపాటి క్లౌడ్‌ కిచెన్‌ ఏర్పాటు చేసి నడిపిస్తున్నారు. దీపావళికి ఏదైనా వినూత్నంగా తయారుచేయాలని ఆలోచించగా.. ఈ ఐడియా వచి్చందని, ఈ స్వీట్స్‌ చూసి ముందు టపాసులు అనుకుంటున్నారని, అసలు విషయం తెలిసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారని హరితారెడ్డి సంతోషం వ్యక్తం చేస్తోంది.

 

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు