Breaking News

దూసుకొచ్చిన మృత్యువు

Published on Tue, 06/03/2025 - 11:09

కాటారం : కారు డ్రైవర్‌ అతివేగం, అజాగ్రత్త ఇద్దరు వృద్ధుల నిండు ప్రాణాలు బలితీసుకుంది. కాలక్షేపం కోసం ఇంటి ఎదుట కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్న వారిపైకి కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలైన ఘటన సోమవారం జయశంకర్‌భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారంలో చోటు చేసుకుంది. స్థానికులు, బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మారుపాక మధునమ్మ (90), నీలారపు బాలయ్య (65), మల్లయ్య ఆయన మనుమడు ఆరేళ్ల బాలుడు డానియల్‌తో కలిసి రోడ్డు పక్కన తమ ఇళ్ల ఎదుట చెట్టు నీడకు కూర్చొని కాలక్షేపం చేస్తున్నారు. 

ఈ క్రమంలో హైదరాబాద్‌లోని మలక్‌పేటకు చెందిన మొగిళి (కారు డ్రైవర్‌), మరో ముగ్గురు దైవదర్శనం నిమిత్తం కాళేశ్వరం వెళ్లి అన్నారం బ్యారేజ్‌ను సందర్శించి దామెరకుంట మీదుగా తిరుగు ప్రయాణమయ్యారు. డ్రైవర్‌ అజాగ్రత్త, అతివేగం కారణంగా గంగారం ఎస్సీ కాలనీ వద్ద కారు అదుపుతప్పి రోడ్డుకు అవతలి వైపుగా ఉన్న చెట్టును ఢీకొట్టి పక్కనే ఉన్న వృద్ధులపైకి దూసుకెళ్లింది. మధునమ్మ కాలు, తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన బాలయ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మరో వృద్ధుడు మల్లయ్య, డానియల్‌కు సైతం తీవ్ర గాయాలవగా భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి అక్కడి నుంచి వరంగల్‌ ఎంజీఎం తరలించారు. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్‌ పారిపోయాడు. 

కారులో నలుగురు వ్యక్తులు ఉండగా మద్యం తాగి ఉన్నట్లు తెలిసింది. మద్యం మత్తులో అతివేగంతో వెళ్లడంతో ఇద్దరి ప్రాణాలు పోయినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. నలుగురిలో ఓ వ్యక్తిని స్థానికులు పట్టుకోగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలిని కాటారం సీఐ నాగార్జునరావు, ఎస్సై మ్యాక అభినవ్‌ పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్‌ మొగిళిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఘటనాస్థలిని సందర్శించిన ఎంపీ..
గంగారంలో కారు ప్రమాదం విషయం తెలుసుకున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ ఘటనా స్థలిని పరిశీలించారు. ఎస్పీ కిరణ్‌ఖరేతో ఫోన్‌లో మాట్లాడి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని, ప్రమాదానికి కారమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని, అధైర్యపడొద్దని హామీ ఇచ్చారు.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)