Breaking News

ఇంజనీరింగ్‌లో రెండు కొత్త కోర్సులు

Published on Wed, 05/21/2025 - 06:13

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్‌లో మరో రెండు కొత్త కోర్సులు రాబో తున్నాయి. ఐఐటీ మద్రాస్‌ వీటిని అందుబాటులోకి తెస్తోంది. 2025–26 విద్యా సంవత్సరంలో జరిగే జోసా (జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ) కౌన్సెలింగ్‌లో ఇవి ఉంటాయని మద్రాస్‌ ఐఐటీ తెలిపింది. మద్రాస్‌ ఐఐటీలోని అప్లైడ్‌ మెకానిక్స్, బయో మెడికల్‌ విభాగాలు ఈ కోర్సును డిజైన్‌ చేశాయి. ఒక్కో విభాగంలో 40 సీట్లు ఉంటాయని ఐఐటీ అధికారులు తెలిపారు. ప్రస్తుత ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకుని కోర్సులను రూపొందించామని ప్రొఫెసర్‌ వి కామకోటి తెలిపారు.  

ఇవీ కోర్సులు 
నాలుగేళ్ల కాలపరిమితితో ఉండే ఈ రెండు కోర్సుల ప్రత్యేకతలను ఐఐటీ మద్రాస్‌ వెల్లడించింది. కంప్యుటేషనల్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ మెకానిక్స్‌ (సీఈఎం) కోర్సు ఏఐ టెక్నాలజీ ఆధారితంగా ఉంటుంది. సాధారణ ఇంజనీరింగ్‌ విద్య కు భిన్నంగా ఉండే ఈ కోర్సు వల్ల విద్యార్థి సరికొత్త మెకానికల్‌ టూల్స్‌పై పట్టు సాధిస్తాడు. సాలిడ్‌ అండ్‌ ఫ్లూయిడ్‌ మెకానిక్స్‌ మెటీరియల్‌ సైన్స్, డైనమిక్స్‌లో అత్యాధునిక సాంకేతికతను అనుసంధానం చేశారు. 

⇒ బయోమెడికల్‌ ఇంజనీరింగ్‌ను మరింత బలోపేతం చేసేందుకు ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ బయో మెడికల్‌ ఇంజనీరింగ్‌ (ఐబీఎంఈ) ఉపయోగపడుతుంది. ఐవోటీ, ఏఐ, వెబ్‌ ఎనేబుల్డ్‌ మెడికల్‌ టెక్నాలజీని ఈ కోర్సు ద్వారా అందిస్తారు. మారుతున్న వైద్య రంగంలో మంచి ఉపాధికి ఇది తోడ్పడుతుందని చెబుతున్నారు.    

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)