Breaking News

ప్రభుత్వ ఉద్యోగం రాలేదని ఓ విద్యార్థిని..

Published on Sat, 07/05/2025 - 07:55

శాయంపేట/మద్దూరు: ప్రభుత్వ ఉద్యోగం రాలేదని ఓ విద్యార్థిని.. గురుకుల పాఠశాలలో సీటు రాలే దని మరో విద్యార్థిని వేర్వేరుచోట్ల ఆత్మహత్య చేసుకున్నారు. హనుమకొండ, నారాయణపేట జిల్లా ల్లో చోటుచేసుకున్న ఘటనల వివ రాలిలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా పెద్దకోడెపాక గ్రామానికి చెందిన రావుల ప్రత్యూష (24) బీటెక్‌ పూర్తిచేసి రెండేళ్లుగా ఉద్యోగవేటలో ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల ఎంట్రన్స్‌లు రాయగా, కొన్ని మార్కుల తేడాతో ఫలితం రాలేదు. 

దీంతో ప్రత్యూష మనస్తాపానికి గురై శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో దూలానికి ఉరివేసుకుంది. కొద్దిసేపటికి అమ్మమ్మ లక్ష్మి ఇంట్లోకి వచ్చి చూసి.. భయంతో కేకలు వేసింది. చుట్టుపక్కల వారు వచ్చి చూడగా అప్పటికే ప్రత్యూష మృతి చెందింది. తల్లిదండ్రులు కూలీలు. ప్రత్యూష తండ్రి రావుల రమేశ్‌ ఫిర్యా దుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జక్కుల పరమేశ్‌ తెలిపారు. 

గురుకులంలో సీటు రాలేదని 
నారాయణపేట జిల్లా దమ్‌గాన్‌పూర్‌కు చెందిన నర్సప్ప, లక్ష్మి దంపతులకు కుమార్తె, కుమారు డు ఉన్నారు. నర్సప్ప బతుకుదెరువుకు హైదరాబాద్‌ వెళ్లి కూలీ పనిచేస్తుండగా, లక్ష్మి ఊళ్లో వ్యవసాయ కూలీ పనులకు వెళ్తుంది. కుమార్తె మనీషా (14) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగ తి పూర్తి చేసుకొని మద్దూరు బాలికల పాఠశాలలో 9వ తరగతి అడ్మిషన్‌ పొందింది. గురుకుల పాఠశాల లో సీటు కోసం ఎంట్రన్స్‌ రాసింది. 

పరిగి గురుకుల పాఠశాలలో సీటు వచ్చిందని టీసీ తీసుకొని వెళ్లింది. తీరా అక్కడికి వెళ్లాక అక్కడ సీటు రాలేదని తెలిసింది. దీంతో మనస్తాపం చెందిన మనీషా 2వ తేదీ రాత్రి పురుగుమందు తాగింది. తల్లి గమనించి మ హబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించింది. అక్కడే చికిత్సపొందు తూ మనీషా గురువారం అర్ధరాత్రి మృతి చెందింది.  

#

Tags : 1

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)