Breaking News

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Published on Wed, 09/17/2025 - 08:10

మేడ్చల్‌రూరల్‌: రోడ్డు ప్రమాదంలో ఎంబీబీఎస్‌ విద్యార్థినితో పాటు మరో యువకుడు మృతి చెందిన ఘటన మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. మేడ్చల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హన్మకొండ జిల్లాకు చెందిన ఇస్లావత్‌ అనూష (20) ఎల్లంపేట్‌ మున్సిపాలిటీ పరిధి ఘనాపూర్‌లోని మెడిసిటీ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ మూడవ సంవత్సరం చదువుతూ అక్కడే హాస్టల్‌లో ఉంటుంది. 

కాగా మంగళవారం మధ్యాహ్నం తన స్నేహితుడు మహేశ్వర్‌రెడ్డితో కలిసి మేడ్చల్‌ నుండి నగరం వైపు ద్విచక్ర వాహనంపై 44వ జాతీయ రహదారిపై వెళ్తుండగా మార్గమధ్యలో ఆక్సిజన్‌ పార్క్‌ సమీపంలో వెనుక నుండి వేగంగా వచ్చిన లారీ వీరి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు కిందపడిపోగా  అనూష శరీరంపై నుండి లారీ వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్రంగా గాయపడిన మహేశ్వర్‌రెడ్డిని మేడ్చల్‌లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సాయంత్రం 5 గంటల సమయంలో మరణించాడు.   ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్‌ అక్కడి నుండి పరారయ్యాడు. ఈ మేరకు మేడ్చల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)