Breaking News

ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి అక్రమంగా చొరబడి...

Published on Sat, 07/29/2023 - 12:28

హైదరాబాద్: ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి అక్రమంగా చొరబడడంతో పాటు ఆమెను నిర్బంధించి దాడి చేయడమే కాకుండా ఇంటిని ధ్వంసం చేసి అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలతో ఇద్దరు నిందితులను ఫిలింనగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఫిలింనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... ఫిలింనగర్‌లోని వినాయక్‌నగర్‌ బస్తీలో నివసించే కవిత అనే మహిళ ఇంట్లోకి అదే బస్తీకి చెందిన పిల్లికళ్ల కురుమూర్తి(38), పిల్లికళ్ల శేఖర్‌(32) మద్యం మత్తులో ప్రవేశించి దుర్భాషలాడుతూ అసభ్యంగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా ఇంట్లోని సామాన్లను ధ్వంసం చేస్తూ వీరంగం సృష్టించారు.

 కిటీకి అద్దాలతో పాటు టీవీని ధ్వంసం చేశారు. పూల కుండీలు ఎత్తేస్తూ ఇళ్లంతా బీభత్సం సృష్టించడంతో పాటు ఆమెను భయాందోళనకు గురిచేశారు. అడ్డుకునేందుకు ప్రయతి్నంచిన కవితపై దాడికి దిగారు.  ప్రాణాలు ఆరచేతుల్లో పెట్టుకున్న బాధితురాలు వారి బారినుంచి తప్పించుకుని ఫిలింనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితులపై ఐపీసీ 452,.354(బి), 341, 323, 427 నాన్‌బెయిలబుల్‌సెక్షన్ల కింద కేసు నమోదు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.

 ఇదిలా ఉండగా వీరిద్దరూ ఇటీవల బోనాల పండగ రోజు కూడా మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. దీంతో పాటు దాడులకు పాల్పడడుతూ ఫిలింనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదయింది. ఆ ఘటన మరువక ముందే మరోమారు వీరిద్దరూ బస్తీలో దౌర్జన్యానికి దిగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వరుస సంఘటనలతో  వినాయక్‌నగర్‌లో పెరిగిపోతున్న దౌర్జన్యాలపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని స్థానికులు కోరుతున్నారు.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)